Prabhas Hanu : ప్రభాస్ కొత్త మూవీ హీరోయిన్‌ ఎవరు? ఆమె పూర్తి బ్యాంక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ఈ సినిమాతో ఆమె ఒకేసారి పాన్ ఇండియన్ మార్కెట్ లోకి స్టార్ హీరోయిన్ గా అడుగుపెట్టబోతుంది అని చెప్పొచ్చు. తొలుత ఈ సినిమాలో పాకిస్థాన్ హీరోయిన్ ని తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత గత కొద్దిరోజులుగా మృణాల్ ఠాకూర్ ఈ చిత్రం లో నటించబోతున్నట్టు రూమర్స్ చక్కర్లు కొట్టింది.

Written By: NARESH, Updated On : August 17, 2024 7:56 pm

Prabhas Imanvi

Follow us on

#PrabhasHanu : రెబల్ స్టార్ ప్రభాస్ జోరు ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాలు వేగంగా చెయ్యడంలో కానీ, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టడంలో కానీ ప్రభాస్ కి దరిదాపుల్లో ప్రస్తుతం ఏ హీరో కూడా లేకపోవడం గమనార్హం. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆది పురుష్’ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ వీటిలో రాధే శ్యామ్ చిత్రానికి తప్ప మిగిలిన రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. ఓపెనింగ్స్ తోనే దాదాపుగా 70 శాతం కి పైగా రికవరీ అయ్యాయి. అయితే ప్రభాస్ గత రెండు చిత్రాలు ‘కల్కి’, ‘సలార్’ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

సలార్ చిత్రం 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టగా, కల్కి చిత్రం ఏకంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. కల్కి చిత్రం రన్నింగ్ లో ఉండగానే ‘రాజా సాబ్’ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసిన ప్రభాస్, ఇప్పుడు హను రాఘవపూడి తో పీరియాడికల్ లవ్ స్టోరీ ని ప్రారంభించాడు. నేడు హైదరాబాద్ లోని మైత్రీ మూవీ మేకర్స్ ప్రధాన ఆఫీస్ లో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్, డైరెక్టర్ హను, ప్రశాంత్ నీల్, నవీన్ ఎర్నినేని తో పాటు మిగిలిన మూవీ టీం హాజరైంది. వీరితో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ‘ఇమాన్వి’ కూడా హాజరైంది. ఇంస్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయిన ఈమె ఏకంగా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి. ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఒకసారి తెరిచి చూస్తే ఈమె ఎంత హాట్ బ్యూటీ అనేది అర్థం అవుతుంది. అంతే కాదు ఇది వరకు ఆమె ఎన్నో రీల్స్ కూడా చేసింది. ఆ రీల్స్ లో క్యూట్ ఎక్సప్రెషన్స్ , డ్యాన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ సినిమాతో ఆమె ఒకేసారి పాన్ ఇండియన్ మార్కెట్ లోకి స్టార్ హీరోయిన్ గా అడుగుపెట్టబోతుంది అని చెప్పొచ్చు. తొలుత ఈ సినిమాలో పాకిస్థాన్ హీరోయిన్ ని తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత గత కొద్దిరోజులుగా మృణాల్ ఠాకూర్ ఈ చిత్రం లో నటించబోతున్నట్టు రూమర్స్ చక్కర్లు కొట్టింది.

కానీ ఆమె అలాంటిదేమి లేదని తేల్చి చెప్పడంతో ఆ రూమర్స్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కొత్తగా ఈ ఇమాన్వి అనే అమ్మాయి తెరమీదకి రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తున్నారు. ఈమధ్య కాలంలో కొత్త హీరోయిన్స్ ఒక సినిమాలో చేస్తే ఆ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడుతుంది. శ్రీలీల, భాగ్యశ్రీ భోర్సే విషయం లో ఇది మనం చూసాము. ఆడియన్స్ ఎప్పటికప్పుడు హీరోయిన్స్ విషయంలో కొత్తదనం కోరుకుంటున్నారు. మరి ఈ హాట్ బ్యూటీ ఎక్కువ కాలం సినీ రంగం లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందా, లేదా ఒకటి రెండు సినిమాల తర్వాత మాయమవుతుందా అనేది చూడాలి.అయితే ఒక హీరోయిన్ ఎక్కువ కాలం రాణించాలంటే అందం తో పాటు నటన, డ్యాన్స్ కూడా అద్భుతంగా ఉండాలి. ఆ మూడు ఈ అమ్మాయిలో ఉన్నాయి కాబట్టి రాబొయ్యే రోజుల్లో ఈమె పెద్ద రేంజ్ కి వెళ్లొచ్చు.