Thalapathy Vijay : దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. కాగా జన నాయగన్ ఓటీటీ రైట్స్ ని ఓ ప్రముఖ సంస్థ ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకుందని సమాచారం. రికార్డు ధరకు జన నాయగన్ ఓటీటీ హక్కులు అమ్ముడైన నేపథ్యంలో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
కోలీవుడ్ లో అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు విజయ్. జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ సినిమాలకు వందల కోట్ల వసూళ్లు దక్కుతున్నాయి. కాగా విజయ్ రాజకీయ ప్రవేశం చేశారు. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ స్థాపించిన విజయ్.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. విజయ్ సభలకు పెద్ద ఎత్తున జనాలు హాజరవుతున్నారు. తమిళ రాజకీయాల్లో విజయ్ ట్రెండ్ సెట్టర్ అవుతారు. సీఎం అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
Also Read : పవన్ కళ్యాణ్ స్పీచ్ ని రీమేక్ చేసిన విజయ్..వైరల్ అవుతున్న వీడియో!
ఇక రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు గుడ్ బై చెప్పాడు విజయ్. చివరి చిత్రంగా జన నాయగన్ చేస్తున్నారు. తన పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడేలా జన నాయగన్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని సమాచారం. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఖాకీ, నెర్కొండ పార్వై, తెగింపు వంటి చిత్రాలను హెచ్ వినోద్ తెరకెక్కించాడు. విజయ్ తన చివరి చిత్రం చేసే అరుదైన అవకాశం వినోద్ కి ఇచ్చాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ కి జంటగా పూజ హెగ్డే నటిస్తుంది.
బాబీ డియోల్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. జన నాయగన్ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జన నాయగన్ ఈ ఏడాది విడుదల కావాల్సింది. జనవరి 2026కి పోస్ట్ పోన్ అయ్యింది. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు జన నాయగన్ థియేటర్స్ లోకి తెచ్చే ఆలోచనలో విజయ్ ఉన్నాడు. విడుదలకు చాలా సమయం ఉంది. అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి.
జన నాయగన్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. రూ. 121 కోట్ల భారీ మొత్తం జన నాయగన్ ఓటీటీ రైట్స్ పలికాయని సమాచారం. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీ జన నాయగన్ రైట్స్ ప్రైమ్ సొంతం చేసుకుందట. కేవలం ఓటీటీ హక్కులతో వంద కోట్లకు పైగా రాబట్టి విజయ్ మరోసారి తన స్టామినా ఏమిటో నిరూపించాడు. కాగా విజయ్ కెరీర్లో లియో మూవీ అత్యధిక ఓటీటీ ధర పలికిన చిత్రంగా ఉంది. కాంబినేషన్ రీత్యా లియో మూవీ ఓటీటీ హక్కులు రూ. 150 కోట్లకు కొన్నారు.
Also Read : హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం తమిళ రాజకీయాల్ని మారుస్తుందా?