Tollywood News: ‘నేను హీరోనయ్యా , విలన్ గా చేయడం ఏమిటి ? అని మడికట్టుకు కూర్చున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆర్ నారాయణ మూర్తిని చూస్తే అర్ధం అవుతుంది. నిజానికి ఆర్ నారాయణ మూర్తికి మంచి క్యారెక్టర్స్ ఇవ్వడానికి చాలామంది టాప్ డైరెక్టర్స్ ప్రయత్నాలు చేశారు. కానీ, నేను హీరోగానే చనిపోయేవరకు నటిస్తాను అంటూ నారాయణ మూర్తి వచ్చిన ఛాన్స్ లను కాదనుకున్నారు.

కానీ, ఒకప్పుడు సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ సినిమాల హీరోగా బాగా చలామణి అయిన జగపతి బాబు మాత్రం అలాంటివి ఏవి పెట్టుకోకుండా విలన్ గా మారిపోయాడు. నిజానికి జగపతి బాబు విలన్ గా మారడానికి ముందు వరకు ఆయనకు హీరోగా సినిమాలు ఉన్నాయి. కానీ, వరుసగా తన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి బాక్సాఫీస్ వద్ద దారుణంగా బకెట్ తన్నేస్తూ వచ్చాయి.
ఇక ఒక్క హిట్ కూడా రాకపోవడంతో.. ఇక చేసేది ఏమి లేక మొత్తానికి హీరోగా సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. అయినా, కొందరు కొత్త నిర్మాతలు మాత్రం చిన్నాచితకా ఎమౌంట్ పట్టుకుని సినిమాలు చేస్తాం అంటూ వచ్చేవాళ్ళు. అయితే, తన సినిమాల మార్కెట్ తనకు తెలుసు కాబట్టి.. జగపతి బాబునే స్వయంగా తనతో ఇక సినిమాలు తీయకండయ్యా అంటూ నిర్మాతలు చెప్పుకునేవాడట.
అలాంటి సమయంలో బోయపాటి శ్రీను వచ్చి విలన్ వేషం ఇచ్చాడు. బాలయ్య బాబు లెజండ్ లో విలన్ గా చేశాక, జగపతి బాబు సుడి తిరిగింది. పాతికేళ్ళు హీరోగా చేస్తే ఎంత సంపాదించానో.. పదేళ్ళు విలన్ గా చేసి అంతకంటే ఎక్కువ సంపాదించాను. ఇంకా సంపాదించుకుంటున్నాను అంటూ జగపతి బాబునే స్వయంగా చెప్పాడు అంటేనే విలన్ గా ఆయనకున్న డిమాండ్ ను అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు హీరో శ్రీకాంత్ కూడా విలన్ గానే మారుతున్నాడు. శ్రీకాంత్ పరిస్థితి కూడా సేమ్ జగపతి బాబుదే. హీరోగా పెద్దగా సంపాదించింది ఏమి లేదు, అయితే, ఇప్పుడు విలన్ గా బాగా సంపాదించుకునే అవకాశం ఉంది. మరి శ్రీకాంత్ ఆ అవకాశాన్ని ఎంతవరకు వాడుకుంటాడో చూడాలి. అలాగే హీరో రాజశేఖర్ కూడా త్వరలో విలన్ గా మారనున్నాడు.
Also Read: శరవేగంగా పుష్ప షూటింగ్.. నెట్టింట్లో బన్నీ లుక్స్ వైరల్!