Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి రోజుకో అప్డేట్తో హైప్ పెంచుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో బన్నీ.. పూర్తి పల్లెటూరి మొరటోడిగా మాస్‌లుక్‌లో కనిపించనున్నా
రు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు సుకుమార్. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో షూటింగ్ సమయంలో పుష్ప టీమ్ చేస్తున్న సందడంతా కనిపించింది. ఆ ఫొటోలు మీకోసం. మరోవైపు, ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయనుంది చిత్రబృందం. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పేరుతో పాట రానుంది. ఈ పాట ప్రోమోకు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల5 నిమిషాలకు ప్రోమోను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
#PushpaFourthSingle Promos will be out today @ 4:05 PM. 🔥🤙#Pushpa #PushpaTheRise
— Pushpa (@PushpaMovie) November 16, 2021
ఈ పాటపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్‌కి ఈ పాట ఫేవరట్ అని కూడా తెలిపారు. పూర్తి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోన్న అల్లు అర్జున్.. ఈ పాటకు ఎలా స్టెప్పులేస్తాడో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ కూడా అంతే మాస్ బీట్స్ అందించినట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. జగపతి బాబు, సునీల్, అనసూయ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో ఎప్పుడూ కనిపించని విభిన్నమైన పాత్రలో బన్నీ ఈ మూవీలో కనిపించనున్నారు. ఈ సినమాలో రష్మిక హీరోయిన్గా కనిపించనుంది.