Telugu TV Channels TRP Ratings: కొంతకాలంగా స్టార్ మా తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. జీ తెలుగు పోటీ పడుతున్నప్పటికీ దానికి ఆ స్థాయి సరిపోడం లేదు. స్టార్ మా మార్కెటింగ్.. ప్రమోషన్.. ఇంకా ఇతరత్రా వ్యవహారాలలో దూసుకుపోతోంది. కానీ సామర్ధ్యం జీ గ్రూపుకు లేకపోవడంతో అది రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈటీవీ, జెమిని మూడు నాలుగు స్థానాలలో కొట్టుమిట్టాడుతున్నాయి. జెమిని అయితే కొన్ని సందర్భాలలో ఐదు, ఆరు స్థానాలకు కూడా పడిపోతుంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈటీవీ, జెమిని నేడు ఈ స్థాయి పడిపోవడం బాధాకరమే.
స్టార్ మా లో బిగ్ బాస్ , శ్రీముఖి పోస్ట్ చేసే స్టార్ మా పరివారం.. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. వీటికోసం స్టార్ మా గ్రూపు భారీగానే ఖర్చు పెడుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ కోసం అయితే ప్రత్యేకంగా సెట్లు.. నాగార్జునకు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటుంది. వాస్తవానికి ఎంత జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నించిన అవి రెండు స్టార్ మా ప్లస్ కావడం లేదు. పైగా చెప్పుకోదగ్గ స్థాయిలో రేటింగ్స్ నమోదు చేయడం లేదు. స్థూలంగా చెప్పాలంటే ఇవాల్టికి స్టార్ మాను కాపాడుతోంది కార్తీకదీపమే. అటు తిప్పి..ఇటు తిప్పి కలగూర గంప చేస్తున్నప్పటికీ ఇవాల్టికి సగటు తెలుగు ప్రేక్షకుడు కార్తీక దీపాన్ని చూస్తున్నాడు. ఈ సీరియల్ మొదటి పార్ట్ సూపర్ హిట్ అయింది. రెండవ పార్ట్ కొద్ది నెలల క్రితం మొదలైంది. ఊహించినట్టుగానే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దుమ్మురేపుతోంది.. తాజా రేటింగ్స్ ప్రకారం కార్తీకదీపం ఏకంగా 11.43 టీఆర్పి సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. గుండెనిండా గుడిగంటలు 10.69, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.36, మేఘసందేశం 9.52, ఇంటింటి రామాయణం 9.5, జగదాత్రి 8.72, చామంతి 8.69, లక్ష్మీ నివాసం 8.43, జయం 8.33, చిన్ని 8.07 రేటింగ్స్ నమోదు చేశాయి. అయితే తొలి మూడు సీరియల్స్ స్టార్ మా లోనే టెలికాస్ట్ అవుతూ ఉండటం విశేషం.
టిఆర్పి రేటింగ్స్ అంత సొక్క మా? అందులో అంతా పాదదర్శకంగానే జరుగుతుందా? అనే ప్రశ్నలు సగటు ప్రేక్షకుడికి రావచ్చు. ఆ రేటింగ్స్ లో ఎంతటి సచీలత ఉందో తెలియదు.. ఎంతటి పారదర్శకత ఉందో తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం నిజం.. ఇవాల్టికి తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ జాబితాలో మాటీవీదే నెంబర్ వన్ స్థానం. చివరికి ఆ గ్రూపు నుంచి టెలికాస్ట్ అవుతున్న మా మూవీస్, మా మ్యూజిక్ కూడా దుమ్ము రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అవి జెమిని ఛానల్ మించి రేటింగ్స్ నమోదు చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఏ చానల్స్ కూడా పోటీచే అవకాశం లేదు కాబట్టి.. మా టీవీ దున్నేసుకుంటుంది.