https://oktelugu.com/

Surya: సూర్య తో సినిమాకి సిద్దమవుతున్న తెలుగు టాప్ డైరెక్టర్…

గజిని, శివ పుత్రుడు, జై భీమ్ లాంటి సినిమాలు చేయగలిగాడు. ఇక చాలా సంవత్సరాల నుంచి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్ గా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నాడు. తెలుగు స్టార్ డైరెక్టర్లందరు కూడా తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆ సినిమాలు పోస్టు పోన్ అవుతూ వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 22, 2024 / 10:25 AM IST

    Surya

    Follow us on

    Surya: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు సూర్య. వైవిధ్యమైన పాత్రలను చేయడంలో సూర్య ఎప్పుడు ముందుంటాడు. ఒక మూస ధోరణి పాత్రలను కాకుండా తనని తాను అప్డేట్ చేసుకునే పాత్రను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన పొజిషన్ ని టాప్ రేంజ్ లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రెగ్యులర్ గా ఉండే పాత్రలు చేయడానికి సూర్య ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించాడు.

    అందువల్లే ఒక గజిని, శివ పుత్రుడు, జై భీమ్ లాంటి సినిమాలు చేయగలిగాడు. ఇక చాలా సంవత్సరాల నుంచి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్ గా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నాడు. తెలుగు స్టార్ డైరెక్టర్లందరు కూడా తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆ సినిమాలు పోస్టు పోన్ అవుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు మాత్రం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

    రీసెంట్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో నెక్స్ట్ తీయబోయే సినిమా మీద గురిజి ఎలాంటి కసరత్తులు చేస్తాడో చూడాలి. ఇక ఆయన నెక్స్ట్ అల్లు అర్జున్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి అయ్యాక సూర్యతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలైతే వస్తున్నాయి. త్రివిక్రమ్ అఆ సినిమా రిలీజైన తర్వాతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావాల్సింది కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు అల్లు అర్జున్ తో సినిమా తర్వాత సూర్య సినిమా చేయాలని కాన్సెప్ట్ లో త్రివిక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక విషయాన్ని సూర్యకి కూడా చెప్పారట. దాంతో తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి.

    త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూర్య నటిస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుంది అంటూ ఇప్పటికి ప్రేక్షకులు ఊహగానాలు కూడా వేస్తున్నారు.త్రివిక్రమ్ ఫార్మాట్ లోకి సూర్య వస్తాడా..? లేదా సూర్య స్టైల్ లో కి త్రివిక్రమ్ వస్తాడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక ఏది ఏమైనా ఈ సినిమా ఒకే అయి పట్టాలెక్కితే గానీ ఎవరి స్టైల్ లోకి ఎవరు వచ్చారనేది పూర్తి గా తెలియదు…