Rajinikanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో వరుస సక్సెస్ లను సాధించిన ఏకైక హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమలహాసన్ ఇద్దరూ కూడా తమదైన రీతిలో సినిమాలు చేస్తూ తమిళ్ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు.
అలాగే వాళ్ళు చేసిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఉండేవి కాబట్టి ఇక్కడ కూడా వాళ్లకు చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండేవారు.ఇక ఈ క్రమంలోనే రజనీకాంత్ తన ఓన్ స్టైల్ తో ప్రేక్షకులను మైమరిపించేవాడు. రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు తమిళనాడు లో ఉన్న అభిమానులు అందరూ ఆ సినిమాని ఫస్ట్ రోజు చూడ్డానికి తెగ ఉత్సాహం చూపించేవారు. అలాగే తెలుగులో చిరంజీవి సినిమా వచ్చిన కూడా అభిమానులు విపరీతమైన ఆదరణని చూపించేవారు.
ఇక కమలహాసన్ సినిమా వచ్చిన కూడా ప్రేక్షకులు అదే రేంజ్ లో సినిమా మీద చూసేవారు. ఇక ఇలాంటి క్రమం లో కమలహాసన్, చిరంజీవి ఇద్దరు కూడా భారీ డ్యాన్సులు వేస్తూ సినిమాలను సక్సెస్ చేస్తూ వచ్చేవారు. వీరిద్దరితో పోల్చుకుంటే రజనీకాంత్ డాన్స్ ఎక్కువగా చేయలేడు.తను ఎంతసేపు సాంగ్ వస్తున్నప్పుడు అటు ఇటు నడవడం తప్ప ఆయన పెద్దగా డాన్స్ చేసిన సినిమాలు అయితే లేవు. కాబట్టి ఒకానొక సమయంలో రజినీకాంత్ చిరంజీవిని, కమలహాసన్ ని చూసి కొద్ది వరకు భయపడ్డట్టుగా వార్తలైతే వచ్చాయి. అయితే రజినీకాంత్ తన సన్నిహితుల దగ్గర చిరంజీవి, కమలహాసన్ ల ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు డాన్స్ లు బాగా చేస్తూ ఉంటారు.
నేను డ్యాన్స్ చేయలేను అంటూ తను కొంచెం ఇన్ సెక్యూరిటీ గా ఫీల్ అయ్యేవాడు అంటూ అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక రజనీకాంత్ డాన్సులు వేయకపోయిన కూడా తన అభిమానులు ఆయనని స్క్రీన్ మీద చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక చిరంజీవి, కమలహాసన్ డాన్సులు చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేవారు ఇక మొత్తనికైతే వీళ్ళు ముగ్గురు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ హీరోలనే చెప్పాలి. వీళ్లను బీట్ చేసే హీరోలు ఇప్పటివరకు రాలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…