Telugu star directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కథలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించాలి. కాబట్టి మన దర్శకులు వైవిద్య భరితమైన కథలను సెలెక్ట్ చేసుకొని హీరోలను డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తున్నారు. దర్శకుడు మొదట ఒక కథతో సినిమాని స్టార్ట్ చేసి అది అంత పెద్దగా సెట్ అవ్వకపోవడంతో ఆ కథను మార్చి మరో కథతో సినిమాను చేశారు. ఇంతకీ వాళ్లు అలా మార్చి చేసిన కథలు ఏంటి ఆ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను సంపాదించుకున్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ప్లాప్ అయిన విషయక్ మనకు తెలిసిందే… మొదట ఒక కథనైతే రాసుకున్నారు. ఆ కథ హాలీవుడ్ సినిమాకి అనఫిషియల్ రీమేక్ గా తెరకెక్కించాలని షూటింగ్ స్టార్ట్ చేశారు. ఒక హాలీవుడ్ సినిమా నుంచి అనఫిషియల్ గా ఆ సినిమాని రీమేక్ చేయాలని చూశారు. కానీ అప్పటికే తమిళ్ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న ‘లియో’ సినిమా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న త్రివిక్రమ్ సినిమా స్టోరీ ని మార్చాలని చూశాడు. అయితే లియో సినిమా ‘ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్’ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఇక త్రివిక్రమ్ దాంతో ఏం చేయాలో తెలియక ఆ కథను మార్చి ‘గుంటూరు కారం’ పేరుతో ఒక కమర్షియల్ సినిమానైతే చేశాడు. ఆ సినిమా అనుకున్న రేంజ్ లో విజయాన్ని సాధించలేకపోయింది…
Also Read: ‘ఓజీ’ మొదటి రోజు వసూళ్లు 154 కోట్లు.. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇంతేనా!
పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సైతం మొదట వేరే కథతో సినిమా తెరకెక్కింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ కథని మార్చమని పవన్ కళ్యాణ్ చెప్పడంతో మరో కథ రాసుకొని ఆ స్టోరీ తో సినిమా తెరికెక్కించాడు…ఇలా మన స్టార్ హీరోలా సినిమాల కథలను మార్చేయడం వల్ల కొన్ని నెగెటివ్ రిజల్ట్ ను ఇస్తే మరికొన్ని పాజిటివ్ రిజల్ట్ ని సంపాదించుకున్నాయి…
