Producer M. Ramakrishna Reddy: తెలుగు చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి కన్నమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఐతే, చెన్నైలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన తుదిశ్వాస విడవడం సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది. ఆయన మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రామకృష్ణారెడ్డి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. 1948 మార్చి 8న ఆయన నెల్లూరు జిల్లాలోని గూడూరులో జన్మించారు. ఆయన తల్లి శ్రీమతి మస్తానమ్మ, ఆయన తండ్రి ఎం.సుబ్బరామిరెడ్డి. రామకృష్ణారెడ్డి తన చదువు పూర్తయ్యాక కొంతకాలం సిమెంట్ రేకుల వ్యాపారాన్ని కూడా చేశారు. ఆ వ్యాపారంలో ఆయన బాగా పైకి వచ్చారు. బాగా సంపాదించారు.
Also Read: TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’
దాంతో రామకృష్ణారెడ్డి బంధువు ‘ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డి’గారు సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించారు. అలా రామకృష్ణారెడ్డి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ‘అలా.. వైకుంఠపాళి, అల్లుడుగారు జిందాబాద్, గడుసు పిల్లోడు, మా ఊరి దేవత, అభిమానవంతులు, మూడిళ్ల ముచ్చట, సీతాపతి, అగ్ని కెరటాలు, మాయగాడు వంటి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి పలు విజయాలు అందుకున్నారు.
ఆయన లాస్ట్ సినిమా అమ్మోరు తల్లి. ఈ చిత్రాన్ని ఆయన తెలుగులోకి డబ్ చేశారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున రామకృష్ణారెడ్డి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read:IPL 2022 Eliminator: ఐపీఎల్: ఆర్సీబీ సెమీస్ కు.. లక్నో కొంప ముంచింది ఏంటి?