OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సమంత, నయనతార, విజయ్ సేతుపతి కాంబో లో వస్తున్న చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. తెలుగులో ‘కణ్మణి రాంబో ఖతీజా’. విఘ్నేష్ శివన్ దర్శకుడు. గురువారం షూటింగ్ పూర్తయిన సందర్భంగా సెట్స్‌లో చిత్ర బృందం సందడి చేసింది. నాయికానాయికలు, దర్శకుడు కేక్ కట్ చేసి సందడి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లవ్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలకానుంది.

మరో అప్ డేట్ ఏమిటంటే..ప్రతిష్ఠాత్మక సినీ వేడుక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ నటుడు విల్ స్మిత్.. వ్యాఖ్యాత క్రిస్ రాక్‌పై చేయి చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మిత్‌పై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది. అలాగే ఉత్తమ నటుడిగా స్మిత్‌కు అందజేసిన ఆస్కార్‌ను వెనక్కి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూశారు. క్యాన్సర్ కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఇవాళ మృతి చెందారు. బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. సుమన్ , ఏయన్నార్, జగపతిబాబు వంటి స్టార్స్‌తో కూడా పని చేశారు. శరత్ మృతి పట్ల చిత్ర పరిశ్రమ ప్రగాఢ సానుభూతి తెలిపింది.

అలాగే ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తనను లైంగికంగా వేధించాడంటూ.. 2020లో గణేష్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం తాజాగా గణేష్‌పై అంథేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గణేష్‌తో పాటు అతని సహయకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
[…] Tiger Nageswara Rao Movie New Update: 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు ‘టైగర్ నాగేశ్వరరావు’. కాగా ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఇప్పటికే కృతీ సనన్ సోదరి నుపూర్ సనన్‌ను హీరోయిన్ గా నటిస్తోంది. […]
[…] Snake Viral Photo: ఇటీవల కాలంలో పజిల్స్ కు మంచి ప్రాధాన్యత వస్తోంది. మెదడుకు మేత అంటూ అన్నింట్టోనూ పజిల్స్ నే ఇస్తున్నారు. దీంతో వాటిని కనిపెట్టేందుకు కొన్నింట్లో కళ్లకు మరికొన్నింట్లో మెదడుకు పని చెప్పాల్సి ఉంటోంది. సుడోకోలు పరిష్కరిస్తే తెలివి కల వారే అని సందిగ్ధంగా ఉండే వాటిని ఇస్తూ వారి మేథస్సుకు పరీక్షలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వెబ్ సిరీస్ లపై ప్రేక్షకుల ధ్యాస మళ్లించేందుకు ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. […]