https://oktelugu.com/

Aha OTT: మరో సరికొత్త షోకు శ్రీకారం చుట్టిన ‘ఆహా’

Aha OTT: ప్రస్తుత్తం ఏ సినిమా థియేటర్​లో విడుదలైన చివరకు ఓటీటీలోకి రావాల్సిందే. అలా ముందుగానే ఆలోచించి తెలుగు ప్రేక్షకుల కోసం అల్లు అరవింద్​ తీసుకొచ్చిన సరికొత్త ప్లాట్​ఫామ్ ఆహా. తొలి తెలుగు ఓటీటీ సంస్థగా అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే తిరుగులేని గుర్తింపు పొందిన యాప్​ ఆహా. ఈ యాప్​ లాంచ్​ చేసిన కొద్దికాలంలోనే అత్యధిక డౌన్​లోడ్స్​తో రికార్డు సృష్టించింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లు సినిమాలు రిలీజ్ చేస్తూ.. సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 11:14 AM IST
    Follow us on

    Aha OTT: ప్రస్తుత్తం ఏ సినిమా థియేటర్​లో విడుదలైన చివరకు ఓటీటీలోకి రావాల్సిందే. అలా ముందుగానే ఆలోచించి తెలుగు ప్రేక్షకుల కోసం అల్లు అరవింద్​ తీసుకొచ్చిన సరికొత్త ప్లాట్​ఫామ్ ఆహా. తొలి తెలుగు ఓటీటీ సంస్థగా అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే తిరుగులేని గుర్తింపు పొందిన యాప్​ ఆహా. ఈ యాప్​ లాంచ్​ చేసిన కొద్దికాలంలోనే అత్యధిక డౌన్​లోడ్స్​తో రికార్డు సృష్టించింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లు సినిమాలు రిలీజ్ చేస్తూ.. సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మంచి మంచి కంటెంట్​లను ఇస్తోంది ఆహా. ఈ క్రమంలోనే బాలకృష్ణతో కూడా అన్​స్టాపబుల్​ పేరుతో ఓ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

    Aha OTT

    Also Read: పక్క రాష్ట్రాల్లో బెనిఫిట్​ షోకు లేని ఇబ్బంది.. ఏపీలో ఎందుకొచ్చింది?

    ఇప్పటికే మూడు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ షో.. భారీ రెస్పాన్స్​తో దూసుకెళ్లిపోతోంది. కాగా, ఇప్పుడు సరికొత్త షోకు శ్రీకారం చుట్టేందుకు మొదలైంది ఆహా. ఐడల్​ అంటే ఇప్పటి వరకు మనకు గుర్తొచ్చేది హిందీలో ప్రసారమయ్యే పాటలపోటీ. కానీ, ఆహా త్వరలోనే తెలుగు ఇండియన్​ ఐడల్​ షోను ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని అధఇకారికంగా ప్రకటించింది కూడా.

    తెలుగు సింగింగ్​ ట్యాలెంట్​ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త షోను మొదలుపెట్టనుంది. ఇందులో భాగంగా ఆడిషన్స్​కు సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు. డిసెంబరు 26న తొలి ఆడిషన్స్​ జరగనున్నాయి. ఇందుకోసం14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీగాయకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌లో ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారు.

    Also Read: “పుష్ప” రాజ్ కు బెస్ట్ విషెస్ చెప్పిన చిట్టిబాబు ” రామ్ చరణ్ “…