OTT ప్లేట్ ఫారం వైపు అడుగులేస్తున్న చిత్రాలు

కరోనా వైరస్ గుప్పెట్లో చిక్కి చిత్ర పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. సినిమా థియేటర్స్ బంధ్ కావడంతో చాలా చిత్రాల విడుదల ఆగిపోయింది. దీనితో కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన చిత్రాలు ఆగిపోయాయి. దాంతో పెట్టుబడి పెట్టిన నిర్మాతలు వడ్డీల భారంతో నష్టాల పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది. దిల్ రాజు వంటి బడా నిర్మాత తీసిన ” వి ” చిత్రం కూడా లాక్ డౌన్ కారణంగా విడుదలకు ఆమడ దూరంలో నిల్చి పోయింది. కాగా కొందరు […]

Written By: admin, Updated On : April 27, 2020 10:41 am
Follow us on


కరోనా వైరస్ గుప్పెట్లో చిక్కి చిత్ర పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. సినిమా థియేటర్స్ బంధ్ కావడంతో చాలా చిత్రాల విడుదల ఆగిపోయింది. దీనితో కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన చిత్రాలు ఆగిపోయాయి. దాంతో పెట్టుబడి పెట్టిన నిర్మాతలు వడ్డీల భారంతో నష్టాల పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది.

దిల్ రాజు వంటి బడా నిర్మాత తీసిన ” వి ” చిత్రం కూడా లాక్ డౌన్ కారణంగా విడుదలకు ఆమడ దూరంలో నిల్చి పోయింది. కాగా కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు తమ చిత్రాల్ని డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ కోవలో మొదటి చిత్రంగా నిలిచింది `అమృతా రామమ్.`. అమెరికా నేపథ్యంలో సాగే `అమృతా రామమ్’ చిత్రం డైరెక్ట్ గా ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లలో ఒకటైన ” జీ 5 ” లో విడుదల కానుంది. దరిమిలా ఈనెల 29 నుండి `అమృతా రామమ్.` చిత్రం ‘ జీ5 ‘ లో అందుబాటులో ఉండనుంది. ఇక ఇప్పటికే పూర్తయి విడుదలకు నోచుకోని అనేక సినిమాలు O T T ప్లాట్ ఫార్మ్ వైపు అడుగులు వేస్తున్నాయి. వాటిలో తమిళం నుంచి హీరో సూర్య భార్య జ్యోతిక నటించిన ” పొన్ మగళ్ వందాల్ ” చిత్రం ఒకటి కాగా రెండోది హిందీలో అక్షయ్ కుమార్ హీరో గా నటించిన కాంచన రీమేక్ “లక్ష్మి బాంబ్ “. ఈ రెండు చిత్రాలు కూడా త్వరలో O T T ప్లాట్ ఫార్మ్ లో దర్శనమివ్వ నున్నాయి .