https://oktelugu.com/

Baby Movie: తెలుగు సినిమాలు బాలీవుడ్ లో అట్టర్ ఫ్లాప్.. మరి బేబీ సినిమా నిర్మాతలు సాహసం చేస్తారా?

90 కోట్ల వసూలు చేసిన సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన రావడంలో తప్పు లేదు. చిన్న సినిమా.. అందులోనూ లో బడ్జెట్ సినిమా కాబట్టి ఈ సినిమాను రీమేక్ చేస్తే కచ్చితంగా మంచి కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్నారట.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 2, 2023 / 11:45 AM IST

    Baby Movie

    Follow us on

    Baby Movie: చిన్న సినిమాగా వచ్చి ఘనవిజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో చెప్పుకోదగ్గ సినిమా బేబీ. గతంలో రీజనల్ సినిమాగా వచ్చిన కాంతార కూడా ఊహించని హిట్ ను సొంతం చేసుకుంది. కన్నడలో వచ్చిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా మంచి విజయం సాధించింది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఇలా రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్నాయి. అయితే బేబీ సినిమా 2023వ సంవత్సరానికి సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను కూడా రీమేక్ చేయాలి అనుకున్నారట మేకర్స్.

    రూ. 90 కోట్ల వసూలు చేసిన సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన రావడంలో తప్పు లేదు. చిన్న సినిమా.. అందులోనూ లో బడ్జెట్ సినిమా కాబట్టి ఈ సినిమాను రీమేక్ చేస్తే కచ్చితంగా మంచి కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్నారట.ఎందుకంటే ఈ సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే ఈ కంటెంట్ కు ఎవరైనా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈ మధ్య టాలీవుడ్ లో ఓ బ్యాడ్ సెంటిమెంట్ అడ్డు వస్తుందట.

    ప్రస్తుతం రీమేక్ అవుతున్న సినిమాలన్నీ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్నాయి. టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. కానీ హిందీలో రీమేక్ అయితే బాలీవుడ్ లో రెస్సాన్స్ కూడా సరిగ్గా రాలేదు. ఆర్ఎక్స్ 100 సినిమా కూడా తెలుగులో మంచి హిట్ ను అందుకుంది. ఇదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తే మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా కూడా హిట్ ను సొంతం చేసుకుంది. కానీ బాలీవుడ్ లో రీమేక్ అయిన తర్వాత పరాజయాన్ని సొంతం చేసుకుంది.

    ఈ సినిమాలు మాత్రమే కాదు ఎంసీఏ సినిమా కూడా బాలీవుడ్ లో ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. గద్దల కొండ గణేష్ సినిమా తెలుగులో హిట్ అయినా.. బాలీవుడ్ లో ఆదరణ పొందలేదు. ఇండియా సినిమాలను ఆదరిస్తున్న నార్త్ ఆడియన్స్ తెలుగు చిత్రాలను రీమేక్ చేస్తే మాత్రం పెదవి విరుస్తున్నారు. మరి ఇన్ని సినిమాల రిజల్ట్ ను గమనిస్తున్న బేబీ చిత్ర యూనిట్ రీమేక్ చేసే ధైర్యం చేస్తారో లేదో చూడాలి.