Celebrity Love Marriages
Celebrity Love Marriages: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్యల వివాహం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. సినీ పరిశ్రమలో ఎంతో మంది కలిసి సినిమాల్లో నటించి ఆ తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు కులం, మతంతో సంబంధం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిలో కొందరు కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తున్నారు. మరికొందరు మాత్రం కొన్ని రోజుల పాటు కలిసుండి ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్యలు కూడా ఇతర కులాలకు చెందిన వారు. వీరితో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు కులం, మతంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నారో చూద్దాం..
నాగార్జున -అమల:
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున ముందుగా లక్ష్మీతో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వీరు విడాకులు తీసుకున్న తరువాత నార్త్ కు చెందిన అమలతో ప్రేమాయణం సాగించి ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు.
శ్రీకాంత్ -ఊహ:
ఒకప్పుడు కలిసి సినిమాల్లో నటించిన వీరు ఆ తరువాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ -అన్నా లెజ్ నోవా:
పవన్ కల్యాణ్ రష్యాకు చెందిన నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరివి కులాలే కాదు దేశాలు కూడా వేరే. ‘తీన్ మార్’ అనే సినిమా ద్వారా పరిచయం అయిన వీరా ఆ తరువాత లవ్లో పడి పెళ్లి చేసుకున్నారు.
మహేష్ బాబు -నమ్రత:
సౌత్ హీరో మహేష్ బాబు, నార్తకు చెందిన నమ్రతలది ప్రాంతాలు, కులాలు వేరు. ‘వంశీ’ సినిమా ద్వార పరిచయం అయిన వీరు ఆ తరువాత ప్రేమించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
అల్లు అర్జున్ -స్నేహరెడ్డి:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ది కులాంతర వివాహమే. వేరే కులానికి చెందిన స్నేహ రెడ్డిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. స్నేహ రెడ్డికి సినిమాలతో సంబంధం లేకపోయినా బన్నీతో ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.
రామ్ చరణ్-ఉపాసన:
మెగా హీరో రామ్ చరణ్, ఉపాసనలది ప్రేమ వివాహం కాకపోయినా కులాలు వేరు. అయితే వీరు పెళ్లి తరువాత లవ్ బర్ట్స్ లాగే కనిపిస్తారు.
కృష్ణ -విజయనిర్మల:
ఒకప్పుడు సూపర్ స్టార్ గా కొనసాగిన కృష్ణ, తోటి నటి విజయనిర్మలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది కులాలు వేరైనా కలిసి జీవితాన్ని పంచుకున్నారు.