Jobs: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కు సంబంధించిన ఈ సంస్థ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మూడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. కనీసం 55 శాతం మార్కులతో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎవరికైతే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఆసక్తి ఉంటుందో వాళ్లు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 700 రూపాయలుగా ఉండనుందని సమాచారం. https://www.nationalfertilizers.com/index.php?option=com_content&view=article&id=598%3arecruitment-of-sr-medical-officer-in-rfcl-2022&catid=53%3acareers-recruitment-in-rfcl&lang=en లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.