2020 ఓటిటి హిట్స్: సాలిడ్ సౌండ్ తో పేలిన చిన్న చిత్రాలు!

ప్రపంచం మొత్తానికి చెడు చేసిన కరోనా ఓటిటి సంస్థలకు మేలు చేసింది. థియేటర్స్ మూత పడడంతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఏకైక వినోద సాధనాలు మారిపోయాయి. సినిమా ప్రేమికులకు ఓటిటి సంస్థలే దిక్కయ్యాయి. దీనితో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా తమ మార్కెట్ షేర్ పెంచేసుకున్నాయి. భవిష్యత్ అంతా ఓటిటి సంస్థలదే అని ఎప్పటి నుండో వాదన వినిపిస్తుండగా… కరోనా వైరస్ దానిని తక్కువ సమయంలోనే చేసి చూపించింది. థియేటర్స్ మూతపడిన కారణంగా అనేక చిన్న, మధ్య […]

Written By: admin, Updated On : December 29, 2020 3:57 pm
Follow us on


ప్రపంచం మొత్తానికి చెడు చేసిన కరోనా ఓటిటి సంస్థలకు మేలు చేసింది. థియేటర్స్ మూత పడడంతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఏకైక వినోద సాధనాలు మారిపోయాయి. సినిమా ప్రేమికులకు ఓటిటి సంస్థలే దిక్కయ్యాయి. దీనితో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా తమ మార్కెట్ షేర్ పెంచేసుకున్నాయి. భవిష్యత్ అంతా ఓటిటి సంస్థలదే అని ఎప్పటి నుండో వాదన వినిపిస్తుండగా… కరోనా వైరస్ దానిని తక్కువ సమయంలోనే చేసి చూపించింది. థియేటర్స్ మూతపడిన కారణంగా అనేక చిన్న, మధ్య తరహా బడ్జెట్ చిత్రాల విడుదలకు ఏకైక మార్గంగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ నిలిచాయి. ప్రముఖ ఓటిటి సంస్థలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఈ పరిస్థితిని క్యాష్ చేసుకున్నాయి. ఏడాది మొత్తం ఓటిటి విడుదలతోనే సరిపోగా కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చర్చిద్దాం..

Also Read: ఐటమ్‌ సాంగ్‌తో హీటెక్కిస్తున్న మోనాల్‌

కృష్ణ అండ్ హిజ్ లీలా

టాలీవుడ్ నుండి ఓటిటి కి నాంది పలికిన చిత్రాలలో కృష్ణ అండ్ లీలా మొదటిది. మోడ్రన్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చూస్తున్నంత సేపు ఎంటర్టైనింగ్ గా సాగె కథలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. స్టోరీ లైన్ పాతదే అయినా… ట్రెండ్ కి తగ్గట్టుగా తెరకెక్కించి దర్శకుడు రవికాంత్ సక్సెస్ అయ్యాడు. సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాధ్, షాలిని, సీరత్ కపూర్ మంచి నటనతో ఆకట్టుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల ప్రసంశలు దక్కించుకుంది.

భానుమతి అండ్ రామకృష్ణ

నవీన్ చంద్ర, సలోని లూత్రా జంటగా దర్శకుడు శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన చిత్రం భానుమతి అండ్ రామకృష్ణ. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అనిపించుకుంది. తెలుగు ఓటిటి యాప్ ఆహాలో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు అందుకుంది. భిన్న నేపధ్యాలు కలిగిన ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సాగె ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

మలయాళ హిట్ మూవీ మహేషింటే ప్రతీకారమ్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నెట్ ఫ్లిక్స్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఓ సాధారణ ఫోటో గ్రాఫర్ పాత్ర ప్రధానంగా, విలేజ్ రివేంజ్ డ్రామాను దర్శకుడు వెంకటేష్ మహా అద్భుతంగా తెరకెక్కించారు. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా… తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలచిన విధానం కట్టిపడేస్తుంది. నటుడిగా తానేమిటో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో సత్య దేవ్ నిరూపించుకున్నారు.

Also Read: బ్రేక్ వద్దంటూ కాజల్ కి ఫోన్ చేసిన మెగాస్టార్ !

కలర్ ఫోటో

చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం అందుకుంది కలర్ ఫోటో. కుల మత, ధనిక పేద అనే విషయాలతో పాటు శరీర రంగు కూడా ప్రేమకు అడ్డే అనే పాయింట్ ఆధారంగా కలర్ ఫోటో తెరకెక్కించారు. ఆహాలో ప్రసారమైన కలర్ ఫోటో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుహాస్, చాందిని చౌదరి నటనకు ప్రశంసలు దక్కాయి. విలన్ గా సునీల్ లోని మరో కోణం ఆవిష్కరించింది కలర్ ఫోటో మూవీ. వైవా హర్ష ఈ చిత్రంతో కెరీర్ కి మంచి పునాది వేసుకున్నారు.

ఆకాశం నీ హద్దురా

సూర్య కెరీర్ లో ఉత్తమ చిత్రం అనే ప్రశంసలు దక్కించుకుంది ఆకాశం నీ హద్దురా. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జి ఆర్ గోపినాధ్ బియోగ్రఫీగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా హిట్ టాక్ సొంతం చేసుకుంది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర టేకింగ్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. సూర్య నటన నభూతో నభవిష్యత్ అన్నట్లు సాగింది. తమిళంలో సూరారై పోట్రుగా విడుదలైన ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక రోల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం విడుదలైంది.

మిడిల్ క్లాస్ మెలోడీస్

ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో మొదటి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది విడుదలైన దొరసాని ఆనంద్ డెబ్యూ మూవీ కాగా అనుకున్నంత విజయం సాధించలేదు. రెండో మూవీగా ఆయన మిడిల్ క్లాస్ మెలోడీస్ చేయడం జరిగింది. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించారు. ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ అందుకుంది. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే ఆర్థిక ఇబ్బందులను వినోదాత్మకంగా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్