https://oktelugu.com/

కేసీఆర్ ఎఫెక్ట్.. ఏపీలో జగన్ సర్కార్ ఉద్యోగాల జాతర

తెలంగాణ కోసం కొట్టాడిన యువత, నిరుద్యోగులను పట్టించుకోని ఇప్పుడు కేసీఆర్ కు తగులుతోందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. అందుకే వారంతా బీజేపీ వైపు తిరిగి తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు అవుతున్నా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయడం లేదు కేసీఆర్. ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. ఉన్న పాఠశాలలే మూసివేయించారు. ఈ క్రమంలోనే రగిలిపోతున్న యువత టీఆర్ఎస్ కు దూరమైంది. Also Read: నారాయణ విమర్శలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2020 / 03:51 PM IST
    Follow us on

    తెలంగాణ కోసం కొట్టాడిన యువత, నిరుద్యోగులను పట్టించుకోని ఇప్పుడు కేసీఆర్ కు తగులుతోందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. అందుకే వారంతా బీజేపీ వైపు తిరిగి తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు అవుతున్నా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయడం లేదు కేసీఆర్. ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. ఉన్న పాఠశాలలే మూసివేయించారు. ఈ క్రమంలోనే రగిలిపోతున్న యువత టీఆర్ఎస్ కు దూరమైంది.

    Also Read: నారాయణ విమర్శలకు రోజా కౌంటర్‌‌

    కేసీఆర్ కు తెలంగాణలో తగులుతున్న ఎదురుదెబ్బలు చూసి ఏపీ సీఎం జగన్ సర్దుకుంటున్నారు. దెబ్బకు ఏపీలో 2021లో ఉద్యోగాల జాతర ప్రకటించాడు. నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఏపీలోని నిరుద్యోగులకు తాజాగా శుభవార్తను అందించింది.

    ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులను శాంతపరిచే చర్యలు జగన్ మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే మూడు డీఎస్సీలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

    Also Read: ఆలూ లేదు.. సూలూ లేదు.. కానీ అప్పుడే నామకరణం

    ఏపీలో స్పెషల్ డీఎస్సీ, లిమిటెడ్ డీఎస్సీ, రెగ్యులర్ డీఎస్సీ పేరిట నోటిఫికేషన్లను జారీ చేయనుంది. గత డీఎస్సీలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరిలో లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక దీని తర్వాత దివ్యాంగ విద్యార్థులకు బోధించేందుకు స్పెషల్ బీఈడీ చేసిన వారి కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించనున్నారు. ఈ రెండు డీఎస్సీలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది.

    డీఎస్సీ ప్రకటనకు ముందు టెట్ నిర్వహణకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరిలో దీన్ని నిర్వహించి ఆ తరువాత మూడు డీఎస్సీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏపీఎస్ఈఆర్టీ ఈ మేరకు టెట్ సిలబస్ రూపకల్పనకు రెడీ అయ్యింది. దీంతో ఇక ఏపీ నిరుద్యోగులంతా చదువులతో బీజీ కానున్నారన్న మాట..

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్