Telugu Heroes Vs Tamil Heroes: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని దారుణంగా ట్రాల్ చేసేవారు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా విమర్శలైతే వచ్చేవి…సౌత్ లో తమిళ ఇండస్ట్రీ నే తోపు అనే వైఖరిలో తమిళులు ఉండేవారు. ఇక దానికి తోడుగా మన హీరోలు మంచి సినిమాలను చేసినప్పటికి తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం మా కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నదని ఎప్పుడూ హేళనగా మాట్లాడేవారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అసలు పట్టించుకునే వారు కాదు మన సినిమాలను చూడడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. మొత్తానికైతే రాజమౌళి పుణ్యమాని బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ ఏది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నే అని చెప్పే స్థాయికి మన వాళ్ళు మన ఇండస్ట్రీని తీసుకెళ్లారు.
తమిళ్ హీరోలు ప్రస్తుతం 1000 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ తమిళ హీరో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టలేదు. కేవలం తెలుగు సినిమా హీరోలు కన్నడ సినిమా హీరోలు మాత్రమే 1000 కోట్ల కు పైన కలెక్షన్ రాబడుతూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఈ క్రమంలోనే తమిళ్ హీరోలు సైతం మేము ఎవ్వరికంటే తక్కువ కాదని ఇండస్ట్రీ హిట్ల ను సాధించగలం అంటూ చెబుతున్నప్పటికి అది ప్రాక్టికల్ గా మాత్రం వర్కౌట్ కావడం లేదు… గత కొన్ని రోజుల నుంచి తెలుగు హీరోలు వర్సెస్ తమిళ హీరోల మధ్య జరుగుతున్న పోటీలో ఎప్పటికప్పుడు తెలుగు హీరోలే విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
ఇక తమిళ్ హీరోలు తెలుగు వాళ్ళను డామినేట్ చేయాలి అనే ఆలోచన మర్చిపోతే మంచిదని, ఎందుకంటే తమిళ్ హీరోలు తెలుగు స్టార్ హీరోస్ ను రీచ్ అవ్వడానికే మరో 5 సంవత్సరాల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. అలాగే తెలుగు హీరోలను బీట్ చేసి ముందుకెళ్లాలంటే వాళ్ళకి ఈ జన్మ సరిపోదని సినిమా మేధావులు కామెంట్స్ చేస్తుండటం విశేషం…