Dude vs Telusu Kada: ప్రతి వారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో సక్సెస్ అయిన సినిమాల గురించి ఇండస్ట్రీలో కొన్ని రోజుల పాటు చర్చలైతే జరుగుతుంటాయి… మొత్తానికైతే ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో డ్యూడ్, తెలుసు కదా సినిమా మధ్య బీభత్సమైన పోటీ ఉంది… ఈ రెండు సినిమాలు ఈరోజు రిలీజ్ అవ్వడంతో ప్రేక్షకులు ఏ సినిమాని చూడాలనే ప్రేక్షకులు ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. ఇక డ్యూడ్ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్ చాలా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు…ఆయన యూత్ లో ఒక మార్క్ ను సెట్ చేశాడు…ఆయన ఎంచుకునే కథలో ఒక సోల్ ఉంటుంది. దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద డెలివరీ చేయగలిగితే సినిమా భారీ సక్సెస్ సాధిస్తోంది…ఇక డ్యూడ్ సినిమాలో ఫస్టాఫ్ బాగుంది, సెకండాఫ్ ఇంకొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసి ఉంటే బాగుండేది…ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులనైతే మెప్పిస్తోంది.
ఇక డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సిద్దు జొన్నలగడ్డ… ఇప్పుడు ఆయన చేసిన ‘తెలుసు కదా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంత ఎఫెక్టివ్ గా లేదు. సిద్దు యాక్టింగ్ పర్లేదు కానీ నీరజ కోన డైరెక్షన్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. కథలో కాన్ఫ్లిక్ట్ కూడా అనుకున్న మేరకు వర్కౌట్ కాలేదు… మొత్తానికైతే ‘తెలుసు కదా’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కొంతమంది ఈ సినిమాను తలనొప్పిగా భావిస్తున్నారు…
ప్రస్తుతం ఈ రెండు సినిమాల్లో డ్యూడ్ సినిమాకి ఎక్కువ అదరణ లభిస్తోంది… కారణం ఏంటంటే ఆ సినిమాలో యూత్ ను ఎట్రాక్ట్ చేసే సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతోంది…
తెలుసు కదా సినిమా మాత్రం ఆశించిన మేరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేదు. అందుకే ఆ సినిమాను చూడడానికి పెద్దగా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు… లవ్ స్టోరీస్ చేసేటప్పుడు ప్రతి ఎమోషన్ సెపరేట్ గా ఉండాలి. అది ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేయాలి. లేకపోతే సినిమా ఫలితం తేడా కొడుతోంది…