Rajamouli Mahabharata: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు గా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి… ఈయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి.అలాగే బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ గా సూపర్ సక్సెస్ కొట్టాడు అలాగే ఇండియా మొత్తానికి ఒక తెలుగు సినిమా స్టాండర్డ్ ఎలా ఉంటుందో చూపించాడు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు.అయిన కూడా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా మహాభారతం గురించి ఎప్పుడు చెబుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ కి సంభందించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది.అదేంటంటే ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న హీరోలందరూ ఉంటారు అని తెలుస్తుంది. అయితే ఎంతమంది హీరోలు ఉన్నా మహాభారతం లో మెయిన్ క్యారెక్టర్లు ఎవరు చేయాలి అనేది రాజమౌళి ఆల్రెడీ డిసైడ్ చేసుకొని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కీలక పాత్రలు అయినా శ్రీకృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు ఈ మూడు క్యారెక్టర్ లకు మాత్రం తెలుగు హీరోలను మాత్రమే పెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం కర్ణుడు గా ప్రభాస్ , కృష్ణుడిగా ఎన్టీఆర్ , అర్జునుడిగా రామ్ చరణ్ ని పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన క్యారెక్టర్లకి ఇండియాలోని అన్ని భాషలలో ఉన్న ఆర్టిస్టులు చేస్తారనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడూ ఉంటుంది అనేది ఇంకా రాజమౌళి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనప్పటికీ ఇప్పటినుంచే దానికి సంబంధించిన పనులను కూడా బ్యాక్ ఎండ్ లో రాజమౌళి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి టార్గెట్ ఏంటంటే పాన్ వరల్డ్ సినిమా చేసి ఇండియన్ సినిమాని ముఖ్యంగా తెలుగు సినిమాని ప్రపంచం ముందు నిలబెట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పెట్టుకున్న టార్గెట్ ఇదే…ఇది రీచ్ అయిన తర్వాత మహాభారతం తెరకెక్కనుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఏది ఏమైనా మహాభారతంలో ఉండే కీలక పాత్రల కోసం తెలుగు హీరోలను తీసుకోవడం నిజంగా రాజమౌళి గ్రేట్నెస్ అనే చెప్పాలి. నిజంగా చెప్పాలి అంటే రాజమౌళి లాంటి ఒక గొప్ప డైరెక్టర్ మన తెలుగులో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఆయనకి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు అందుకే అంత పర్ఫెక్ట్ గా అంత ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ ఉంటాడు…