https://oktelugu.com/

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ హిట్స్ వెనక ఉన్న రహస్యం ఇదే…

ప్రస్తుతం నవీన్ మరొక కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈయన చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకుని ఒక్క ప్లాప్ కూడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : September 18, 2023 / 09:32 AM IST

    Naveen Polishetty

    Follow us on

    Naveen Polishetty: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల్లో యంగ్ హీరో అయినా నవీన్ పోలిశెట్టి రోజురోజుకి మంచి సినిమాలు చేసుకుంటూ తెలుగులో తన స్టార్ డమ్ ని విస్తరించుకుంటూ పోతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన చేసిన మొదటి సినిమా అయినా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ సినిమాకు నవీన్ పోలిశెట్టి వన్ ఆఫ్ ది రైటర్ గా కూడా కొనసాగాడు. అలాగే ఈ సినిమా తర్వాత ఆయన అనుదిప్ తో జాతి రత్నాలు అనే ఒక ఫుల్ లెంత్ సినిమా చేసి తనలోని కామెడీ యాంగిల్ ని కూడా జనాలకి పరిచయం చేశాడు. అలాగే రీసెంట్ గా అనుష్క తో కలిసి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నవీన్ మంచి స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఇప్పుడున్న హీరోలకి పూర్తి భిన్నంగా ఒక మంచి స్ట్రాటజీ తో సినిమాలు చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు. నిజానికి నవీన్ పోలిశెట్టి ఇండస్ట్రీలో చాలా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూనే కొత్త దర్శకులకి కూడా మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఇలాంటి క్రమంలో కొత్త దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఎక్కువ కథలు వినిపిస్తున్నారు కానీ ఆయన మాత్రం సెలెక్టివ్ గా సినిమాలని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు…

    ప్రస్తుతం నవీన్ మరొక కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈయన చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకుని ఒక్క ప్లాప్ కూడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నాడు. అందులో భాగంగానే ఆయన మూడు సినిమాలు హిట్టు కొట్టి హైట్రీక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. మొదట్లో సైడ్ క్యారెక్టర్లు చేసిన నవీన్ ఆ తర్వాత హీరోగా మారడం నిజంగా హర్షించదగ్గ విషయమనే చెప్పాలి. నవీన్ పోలిశెట్టి విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు…ఇక ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నవీన్ ని మీ హ్యాట్రిక్ విజయాల వెనుక రహస్యం ఏంటి అని అడిగితే దానికి ఆయన మాట్లాడుతూ స్టోరీ విన్నప్పుడే అది మనకు సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాను అది బాగుంటుంది అని అనిపిస్తే చేసెస్తా అంతే అని చెప్తూనే అందుకే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అని కూడా చెప్పాడు…