Tollywood Heroes overseas box office records: మన టాలీవుడ్ లో ఒకప్పుడు ఓవర్సీస్ కింగ్ ఎవరు అని అడిగితే మహేష్ బాబు అని కొందరు, పవన్ కళ్యాణ్ అని మరికొందరు చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఓవర్సీస్ లో తిరుగులేని సూపర్ స్టార్ గా అవతరించాడు. మన టాలీవుడ్ కి 2 మిలియన్ డాలర్లు కొట్టడమే పెద్ద ఘనత సాధించినట్టు ఫీల్ అవుతున్న రోజుల్లో, ‘బాహుబలి’ చిత్రం కేవలం నార్త్ అమెరికా నుండే 8.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం అప్పట్లో ఒక సెన్సేషన్. ప్రతీ ఒక్కరు దీని గురించి మాట్లాడుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘బాహుబలి 2’ అయితే ఏకంగా 61 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 500 కోట్ల రూపాయిలు అన్నమాట.
కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి 22 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘ధురంధర్ 2’ వరకు ఈ రికార్డు చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయింది. ఇక ‘బాహుబలి 2’ తర్వాతి స్థానం లో #RRR చిత్రం 46 మిలియన్ డాలర్ల గ్రాస్ తో రెండవ స్థానం లో ఉండగా, ప్రభాస్ కల్కి 2898 AD చిత్రం 32 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లతో మూడవ స్థానంలో నిల్చింది. ఆ తర్వాత నాల్గవ స్థానం లో ‘పుష్ప 2’ చిత్రం 31 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా , సలార్ చిత్రం 16.4 మిలియన్ డాలర్ల గ్రాస్ తో 5 వ స్థానం లో నిల్చింది. అదే విధంగా బాహుబలి చిత్రానికి 15 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాగా, సాహూ చిత్రానికి 12.6 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇలా టాలీవుడ్ నుండి 7 సినిమాలు 10 మిలియన్ గ్రాస్ వసూళ్లను దాటగా, అందులో 5 సినిమాలు ప్రభాస్ వే కావడం విశేషం.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఎట్టకేలకు టార్గెట్ కి అతి చేరువలో..
మిగిలిన రెండు చిత్రాల్లో ఒకటి #RRR , మరొకటి పుష్ప 2. ఎన్టీఆర్ నటించిన దేవర, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రాలు 8 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి తృటిలో 10 మిలియన్ డాలర్ల టార్గెట్ మార్కుని మిస్ అయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రభాస్ డామినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే మిగిలిన హీరోలు రెండేళ్లకు ఒకటి , లేదంటే మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. ప్రభాస్ మాత్రం ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఉండేలా చూసుకుంటున్నాడు. కాబట్టి ఓవర్సీస్ కి ప్రభాస్ తిరుగులేని నెంబర్ 1 హీరో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
