https://oktelugu.com/

స్థానిక ఎన్నికలకు ముందే జగన్ ఆ పని చేయాలి:హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ,వార్డు సచివాలయాలకు వేసిన రంగులు మార్చడం పై హైకోర్టు సీరియస్ అయింది. వైసీపీ జెండా రంగులను వెంటనే తొలగించాలని ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు రంగులను మార్చాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. రంగులను మార్చేందుకు 3 వారాల గడువు కావాలని ప్రభుత్వం పేర్కొంది. మూడు వారాలలోపు రంగులను తొలగించి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఏపీలోని గ్రామ,వార్డు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 21, 2020 / 11:28 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ,వార్డు సచివాలయాలకు వేసిన రంగులు మార్చడం పై హైకోర్టు సీరియస్ అయింది. వైసీపీ జెండా రంగులను వెంటనే తొలగించాలని ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు రంగులను మార్చాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. రంగులను మార్చేందుకు 3 వారాల గడువు కావాలని ప్రభుత్వం పేర్కొంది.

    మూడు వారాలలోపు రంగులను తొలగించి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఏపీలోని గ్రామ,వార్డు సచివాలయాలకు వైసీపీ జెండా రంగులను వేసింది. అయితే దీని పై టీడీపీ వారితో పాటు పలువురు హైకోర్టు మరియు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ రంగులను తొలగించాలని సుప్రీం కోర్టు మరియు హైకోర్టులు తీర్పునిచ్చాయి. రంగుల మార్పుకు సమయాన్ని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాని పై విచారించిన హైకోర్టు 3 వారాల్లో రంగులు తొలగించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశిచ్చింది.