Bollywood Hero: కొన్ని సినిమాలు కొంతమంది జీవితాలను మారుస్తాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కొంతమంది నటులు ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒకే ఒక సినిమా ద్వారా వస్తుంది. ఇక అలా ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ను అందుకొని ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వాళ్లలో ప్రస్తుతం ‘బాబీ డియోల్’ ఒకరు… బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ‘బాబీ డియోల్’ మొదట హీరోగా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఆ తర్వాత ఆయన కెరియర్ అంత సాఫీగా సాగలేదు. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ ఫీలిమ్స్ చేసినప్పటికీ అవి కూడా సరైన సక్సెస్ ని తీసుకొచ్చి పెట్టలేదు. ఇక వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న బాబీ డియోల్ కెరియర్ అనేది అనిమల్ సినిమాతో మారిపోయిందనే చెప్పాలి. తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగ రన్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి తీసిన ‘అనిమల్ ‘ సినిమా గత సంవత్సరం వచ్చి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 900 కోట్ల వరకు కలెక్షన్ల ను రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిందనే చెప్పాలి…ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఒక్క డైలాగ్ చెప్పకుండానే తన ఎక్స్ప్రెషన్స్ తోనే విలనిజాన్ని పండించాడు అంటే ఆయన ఎంత గొప్ప నటుడో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమాలో ఆయన కనిపించేది కూడా చాలా తక్కువ సమయమే అయినప్పటికీ తన క్యారెక్టర్ తో ఒక సగటు ఆడియన్ ను కూడా మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక దాంతో ఇప్పుడు సూర్య తో కంగువ అనే పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. బాలయ్య బాబు బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఔరంగ జేబు పాత్రను పోషిస్తున్నాడు.
ఇక ఒకప్పుడు నాలుగు కోట్లు కూడా తీసుకోలేని ఈ నటుడు ఇప్పుడు 8 కోట్లకు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అదేవిధంగా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…నిజానికి అవకాశాలు సరిగ్గా లేక పీకల్లోతు కష్టాల్లో ఉన్న బాబీ డియోల్ కి సందీప్ రెడ్డి వంగ ఊపిరి పోసాడనే చెప్పాలి. అనిమల్ సినిమాలో ఆయన్ని తీసుకొని మరోసారి బెస్ట్ యాక్టర్ గా చూపించడమే కాకుండా ఇండస్ట్రీలో అతనికి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయేలా చేశాడు. ఇక ప్రస్తుతం ఆయనకు మళ్ళీ అవకాశాలైతే పుష్కలంగా వస్తున్నాయి…