Viral Video: మీకు చిన్న పిల్లలు ఉన్నారా.. వారు ఆరు బయట ఆడుకుంటున్నారా.. మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలను మర్చిపోయారా.. అయితే ఈ వీడియో చూడండి. ఇకపై పిల్లలను ఒంటరిగా ఆరుబయట వదిలేయరు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడులు చేస్తున్నాయి. చిన్న పిల్లలు అయితే ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఎగబడుతున్నాయి. దాడులు చేసి గాయపరుస్తున్నాయి. వీధుల్లో పిల్లలు ఒంటరిగా కనిపిస్తే ప్రాణాలు తీస్తున్నాయి. పిచ్చెక్కి రెచ్చిపోతున్న కుక్కలతో జనం అడగు బయట పెట్టడానికి కూడా వణుకుతున్నారు.
రౌండప్ చేసి మరీ దాడులు..
కుక్కలు కూడా రౌడీ మూకల్లా మారుతున్నాయి. గుంపులుగా వీధుల్లో తిరుగుతున్నాయి. పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు రౌండప్ చేసి రక్కేస్తున్నాయి. పిక్కలు పీకేస్తున్నాయి. ఎవరూ రాకపోతే ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. పఠాన్‌చెరు మండలంలో వీధి కుక్కల దాడిలో బాలుడు మరనించిన సంఘటన మరువక ముందే జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో మరో బాలుడిపై దాడి చేశాయి.
ఇంటి ముందు ఆడుకుంటుండగా..
సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు శ్రీనగర్‌కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఆరు వీధి కుక్కలు ఒక్కసారిగా ఎటాక్ చేశాయి. చేసి పారిపోవడానికి, తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా రౌండప్ చేసి దాడి చేశాయి. బాలుడి కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని >ళ్లతో కుక్కలను కొట్టి అక్కడి నుండి తరిమేశారు. అనంతరం గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
సీసీ కెమెరాలో రికార్డు..
ఇదిలా ఉంటే.. వీధి కుక్కలు బాలుడిపై దాడిచేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒళ్లు గగ్గుర్లు పొడిచే ఈవీడియోను చూసి నెటిజన్లు భయాందోళన చెందుతున్నారు. కుక్కలు ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దని సూచిస్తున్నారు.
బయట ఆడుకుంటున్న చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి
సంగారెడ్డిలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని చుట్టుముట్టి దాడి చేసిన వీధికుక్కలు.. గమనించిన స్థానికులు బాలుడిని రక్షించి, రక్తస్రావం అవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. pic.twitter.com/JtqD1wXhNL
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2024