https://oktelugu.com/

Venu Swamy: బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతున్న వివాదాస్పద వేణు స్వామి… రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Venu Swamy: యూట్యూబర్ బంచిక్ బబ్లు, పరువు హత్యకు బలమైన అమృత ప్రణయ్, జబర్దస్త్ కమెడియన్స్ రీతూ చౌదరి, బుల్లెట్ భాస్కర్, నటి సురేఖావాణి... సీజన్ 8లో కంటెస్ట్ చేయడం ఖాయమంటూ కథనాలు వెలువడుతున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : July 4, 2024 / 01:57 PM IST

    Venu Swamy Bigg Boss Remuneration

    Follow us on

    Venu Swamy: బిగ్ బాస్ తెలుగు 8కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురు సెలెబ్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ మధ్య పొలిటికల్ కామెంట్స్ తో మీడియాలో హైలెట్ అయిన కిరాక్ ఆర్పీ వస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా స్టార్స్ బర్రెలక్క, కుమారీ ఆంటీ లిస్ట్ లో ఉన్నారట. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నటి హేమ మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుందనే ఊహాగానాలు వినిపిస్తన్నాయి.

    యూట్యూబర్ బంచిక్ బబ్లు, పరువు హత్యకు బలమైన అమృత ప్రణయ్, జబర్దస్త్ కమెడియన్స్ రీతూ చౌదరి, బుల్లెట్ భాస్కర్, నటి సురేఖావాణి… సీజన్ 8లో కంటెస్ట్ చేయడం ఖాయమంటూ కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా మరొక సెన్సేషనల్ పర్సనాలిటీ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయనే … వేణు స్వామి. ఈ వివాదాస్పద జ్యోతిష్యుడు తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ పాపులర్. ప్రముఖుల జాతకాలు బహిరంగంగా చెబుతూ వివాదాలు రాజేస్తూ ఉంటాడు.

    వేణు స్వామికి టాలీవుడ్ తో గట్టి సంబంధాలు ఉన్నాయి.ఆయన పూజలు చేస్తే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మే సెలెబ్స్ ఉన్నారు. రష్మిక మందాన, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ తో పాటు పలువురు నటులు, హీరోయిన్స్ ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు. కాగా ప్రభాస్ జాతకం ఇదే అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ విమర్శలపాలయ్యాయి. ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ఆయన మాట్లాడారు. సలార్ ఫెయిల్ అవుతుందని వేణు స్వామి అంచనా వేశారు.

    అలాగే ప్రభాస్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయని అభిమానుల మనోభావాలు దెబ్బతీశాడు. దాంతో వేణు స్వామిని అభిమానులు ట్రోల్ చేశారు. కొందరు హీరోల ఫ్యాన్స్ ని గెలికి వేణు స్వామి తన ఇమేజ్ పెంచుకున్నాడు. కాంట్రవర్సీ స్టార్ అయిన వేణు స్వామి బిగ్ బాస్ హౌస్లో ఉంటే టీఆర్పీ పరుగులు పెడుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలో వేణు స్వామిని నిర్వాహకులు సంప్రదించారట. వేణు స్వామి పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారట.

    వేణు స్వామి అడిగిన మొత్తం ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్దమయ్యారట. బిగ్ బాస్ సీజన్ 8లో వేణు స్వామి కంటెస్ట్ చేస్తున్నారంటూ విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఇక వేణు స్వామి రెమ్యూనరేషన్ ఎంత అనేది తెలియదు కానీ… తెలుగులో ఇంతవరకు ఏ సెలెబ్రిటీకీ ఇవ్వనంత ఇస్తున్నారని వినికిడి.