https://oktelugu.com/

Tollywood Trends: నేటి వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ నటి, మోడల్ షగున్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కొత్త షో ‘హర్ పల్ మోహినీ’ ఇంటర్వ్యూలో పొల్గొన్న ఆమె తన బోల్డ్ రోల్‌పై తన తన తల్లిదండ్రుల స్పందన గురించి తెలిపింది. ఓ వెబ్ సిరీస్‌లో భాగంగా నటుడితో బెడ్‌పై రొమాన్స్ సీన్‌లో నటించాల్సి ఉంటుందని తల్లిదండ్రులతో చెప్పానంది. నీ భవిష్యత్తు కోసం ఇలాంటి చిన్న […]

Written By:
  • Shiva
  • , Updated On : April 12, 2022 / 03:11 PM IST
    Follow us on

    Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ నటి, మోడల్ షగున్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కొత్త షో ‘హర్ పల్ మోహినీ’ ఇంటర్వ్యూలో పొల్గొన్న ఆమె తన బోల్డ్ రోల్‌పై తన తన తల్లిదండ్రుల స్పందన గురించి తెలిపింది. ఓ వెబ్ సిరీస్‌లో భాగంగా నటుడితో బెడ్‌పై రొమాన్స్ సీన్‌లో నటించాల్సి ఉంటుందని తల్లిదండ్రులతో చెప్పానంది. నీ భవిష్యత్తు కోసం ఇలాంటి చిన్న చిన్న సాహసాలను చేయాలని ఆమె తల్లిదండ్రులు తెలిపారంది.

    Tollywood Trends

    ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. కన్నడ సినీ నటుడు, క్రేజీ స్టార్ వి.రవిచంద్రన్‌‌కు బెంగళూరు నగర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. సోమవారం సెంట్రల్ కాలేజీ జ్ఞానజ్యోతి సభా మందిరంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ చేతుల మీదుగా.. రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్‌ను బహుకరించారు. మరో 30 మంది వివిధ రంగాల ప్రముఖులకు డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఉన్నది ఉన్నట్లుగా సినిమాలో చూపించడం రవిచంద్రన్ కళ అని మంత్రి సీఎన్ ఆథ్వథ్ నారాయణ తెలిపారు.

    Also Read: KGF Chapter 2: ‘కేజీఎఫ్ 2’కు తెలంగాణ వరం.. కారణం ఆయనే !

    V. Ravichandran

    ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. ‘దైవపుత్రుడు’ అనే క్రైస్తవ గీతాన్ని పాడిన జయసుధను ప్రశంసిస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. జయసుధగారూ, మీరు పాడిన పాట వింటే విశ్వాసం లేని వారు కూడా విశ్వాసులుగా మారిపోతారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాడు జయసుధ పాటకు సంబంధించిన యూట్యూబ్ చానెల్ లింక్‌ను షేర్ చేశారు. సహజ నటి జయసుధ అంటే ఆర్జీవీకి ప్రత్యేక అభిమానం కలదు.

    Ram Gopal Varma

    మరో అప్ డేట్ విషయానికి వస్తే.. తన తాజా చిత్రం ‘గని’ ప్రేక్షకులను నిరాశ పరచడంపై నటుడు వరుణ్ తేజ్ స్పందించాడు. భవిష్యత్తులో మరింత కష్టపడి అభిమానులను ఎంటర్టైన్ చేస్తానని హామీ ఇచ్చాడు. ఈనెల 8న విడుదలైన బాక్సింగ్ డ్రామా గని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాక బోల్తా పడింది.

    Ghani Movie

    దీంతో అభిమానులకు సారీ చెబుతూ ఓ లేఖను తన సోషల్ ఖాతాల్లో షేర్ చేసుకున్నాడు. ముందు ముందు మరింత డెడికేషన్తో పనిచేసి అభిమానుల్ని అలరిస్తానని చెప్పుకొచ్చాడు.

    Also Read:Minister Ambati Rambabu: వైరల్ : మంత్రి అంబటి రాంబాబు ఫొటోలు లీక్

    Tags