Jagan New Cabinet: జగన్‌కు మొదటి నుంచి ఓ పేరు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. అదే విదేయులకు పెద్ద పీట వేస్తారనేది. అంటే తనను నమ్ముకున్న విధేయులకు వైఎస్ మాట ఇచ్చారంటే ఇక తిరుగు ఉండదు. ఆ తర్వాత జగన్ కూడా ఇలాగే తన విధేయులకు హామీలు ఇచ్చి మొదట్లో నిలబెట్టుకున్నారు కూడా. అయితే రెండోసారి కేబినెట్ లో మార్పులు చేసినప్పుడు మాత్రం చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

ఈ సారి విదేయులకంటే కూడా కుల సమీకరణాలను పెద్దగా నమ్ముకోవడంతో విధేయులకు పెద్ద షాక్ తగిలినట్టయింది. వాస్తవానికి జగన్ మొదటి కేబినెట్ లో ఎక్కువగా విధేయులకు చోటు కల్పించారు. నామినేట్ పదవులతో పాటు పార్టీ పదవుల్లో కూడా తనను నమ్ముకున్న వారికే పెద్ద పీట వేశారు. అయితే ఇప్పుడు రెండోసారి మరికొంతమంది విధేయులకు చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు.
Also Read: Chandrababu KCR: చంద్రబాబు స్ఫూర్తితో కేసీఆర్ ఆ పని.. ఏమవుతుందో ఇక..
కానీ ఈ సారి జగన్ తన బలమైన సంకేతాలను కేబినెట్ లో మార్పుల ద్వారా ఇచ్చారు. తన మీద పడ్డ ముద్రను జగన్ తుడిచివేసుకోవడానికే ఇలా చేశారని అర్థమవుతోంది. మొదటి నుంచి ప్రతిపక్షాలు జగన్ కు కుల పిచ్చి అనే ఆరోపణలను బలంగా చేస్తున్నాయి. అటు ప్రజల నుంచి కూడా ఈ వ్యతిరేకత రావడంతో.. దాన్ని తుడిచేసుకోవడానికి ఈ సారి సామాజిక న్యాయం వైపు అడుగులు వేశారు.

దీంతో ఈ సారి పదవి వస్తుందనుకున్న జగన్ విధేయులు పిన్నెల్లి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పార్ధసారథి, ప్రసాదరాజు, ఉదయభాను లాంటి వారికి ఈ సారి పెద్ద షాకే తగిలింది. వీరంతా ఉన్నత వర్గాలకు చెందిన వారే. అందుకే ఈసారి వీరికి షాక్ తప్పలేదు. కొత్తగా తీసుకున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.
అయితే విదేయుల్లో ఇలాంటి భయం పెరిగిపోతే మాత్రం అది అంతిమంగా జగన్‌కు షాక్ ఇస్తుందని అంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి పార్టీని నడిపించడంలో వీరంతా కీలకంగా వ్యవహరించారు. అలాంటిది వీరు దూరమైతే మాత్రం జగన్‌కు పార్టీ పరంగా ఇబ్బందులు తప్పవు. తండ్రి రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడంటే అందుకు ప్రధాన కారణం విధేయులకు పెద్ద పీట వేయడమే. ఆ తర్వాత జగన్‌కు వారంతా అండగా నిలబడ్డారు. అలాంటి విధేయులను దూరం చేసుకుంటే మాత్రం జగన్ కు రాబోయే కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
Also Read:Roja: రోజా లేని ‘జబర్దస్త్’ లో చెలగిరేపోనున్న కామెడీయన్..!