Telugu Boxoffice: కరోనా క్లిష్ట సమయం నుంచి సినిమా ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లలో సినిమాలు కళకళలాడటానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు థియేటర్ ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం.

భావోద్వేగాల సమ్మేళనంగా రాబోతున్న సినిమా ‘నాట్యం’ !
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యా రాజు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా నాట్యం’. రేవంత్ కోరుకొండ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పై పెద్దగా అంచనాలు లేవు. అయితే మేకర్స్ మాత్రం భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. స్వతహాగా పెద్దింటి అమ్మాయి మొదటిసారి సినిమా చేయడంతో.. స్టార్ హీరోలు కూడా ప్రమోషన్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నెల 22న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ అయితే వచ్చేలా లేవు.

ఓ వైవిధ్యమైన క్రైమ్ డ్రామా ‘అసలేం జరిగింది !
‘అసలేం జరిగింది’ అనే సినిమా ఒకటి వస్తోంది అని సగటు ప్రేక్షకుడికి తెలియదు. కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ గురించి ముచ్చటించుకోవడం వృధా. శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన ఈ సినిమా కూడా 22న థియేటర్లలోకి రాబోతుంది. కానీ కనీస కలెక్షన్స్ కూడా ఈ చిత్రానికి వచ్చేలా లేవు. ఎలాగూ ప్రమోషన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి.. ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడం కష్టమే.

రెగ్యులర్ ప్రేమకథగా రాబోతున్న ‘మధుర వైన్స్’ !
సినిమా పేరులోనే ‘వైన్స్’ ఉంది కాబట్టి.. మరి ఈ ‘మధుర వైన్స్’ సినిమా కూడా వైన్స్ చుట్టే తిరుగుతుందా ? లేక ఏమైనా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. సన్నీ నవీన్, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు. ఈ చిత్రం కూడా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్యానికి బానిసైన ఓ యువకుడు.. ఆ వాసన అంటేనే పడని ఓ యువతి మధ్య ఎలా ప్రేమ పుట్టింది ?

ఆ ప్రేమ కారణంగా కలిగిన సమస్యలు, బావాలు ఏమిటి అనే కోణంలో సాగుతుంది ఈ చిత్రం. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి కూడా వచ్చేలా లేవు . మొత్తానికి ఈ వారం సినిమాల పరిస్థితి కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.