Samantha Plastic Surgery: ఈ మధ్య హీరోయిన్లు తమ ముఖాలకు ట్రీట్మెంట్ లు చేయించుకోవడం చాలా సహజం అయిపోయింది. తప్పదు మరీ.. ప్రతి హీరోయిన్ స్క్రీన్ పై జిగేల్‌మనే అందాలతో, మేకప్ ఫ్లాష్ ల గుమగుమలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. పైగా తమ సొగుసుల ఒయ్యారాల దెబ్బకు ప్రేక్షకులు మైమరచిపోవాలి. తమ కోసం కొట్టే కరతాళ ధ్వనులు మిన్నంటాలి. ఇలాంటి కోరికలు ప్రతి హీరోయిన్ కి ఉంటాయి. అసలుకే గ్లామర్ లోకం. ఆ తళుకుబెళుకులను పక్కనపెడితే.. ఇక ఛాన్స్ లు కూడా రావు. అందుకే.. కష్టమో నష్టమో.. తప్పో ఒప్పో.. మొత్తానికి సర్జరీ ల వైపు హీరోయిన్లు ముచ్చట పడుతున్నారు.

సాధారణంగా 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అప్పటివరకు ప్రదర్శించిన అందాన్ని అలాగే నిలుపుకోవాలన్న ఒత్తిడి ప్రతి హీరోయిన్ పై పెరుగుతుంది. అందుకే, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సదరు హీరోయిన్లు. హీరోయిన్ లో బ్యూటీ తగ్గితే ట్రోల్ చేయడం మొదలు పెడతారు అభిమానులు. అందుకే..అందం కోసం సర్జరీ బాట పడుతున్నారు.
కొందరు హీరోయిన్లు స్కిన్ సమస్యల వల్ల. మరికొందరు వయసు మీద పడడం వల్ల అందానికి మెరుగులు దిద్దుకోవడం తప్పడం లేదు. అందుకే, ఏ హీరోయిన్ ముఖాకృతి కాస్త మారినా వాళ్ళు కచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. లేదా. కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నారనో ప్రచారం జరుగుతుంది. ఇలాంటి ఊహాగానాలు, ప్రచారాలు సమంత విషయంలో తాజాగా మొదలయ్యాయి.

సమంత ప్రస్తుతం ఫారెన్ ట్రిప్ లో ఉంది. ఆమె ట్రిప్ కి మెయిన్ రీజన్.. మొఖానికి ప్లాస్టిక్ సర్జరీ అని టాక్ నడుస్తోంది. ఈ మధ్య సమంత ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో సామ్ బాగా నీరసంగా కనిపిచింది. మొహం పై లైట్ గా ముడతలు కూడా వచ్చినట్లు కనిపించాయి. దాంతో సామ్ కి స్కిన్ జబ్బు ఉంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం పై సమంత మేనేజర్ కూడా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. సమంత తన ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీని ప్లాన్ చేసుకుందట. తన ముఖం మరీ లేతగా కనిపించాలానే ఉద్దేశ్యంతోనే సమంత ఈ సర్జరీ చేయించుకుంటుందట. చాలా యంగ్ గా కనిపించాలనే కోరిక సామ్ కి ఎప్పటి నుంచో ఉందని ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెబుతున్నారు. సమంత వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. ఇంకా 25 ఏళ్ల అమ్మాయిగానే కనిపించాలని సమంత కోరుకుంటుంది.