Sridevi Drama Company: సుధీర్ బాబు ఏంటి అంత మాట అన్నాడు… పాపం రష్మీ ఆవేశంలో పరువు పోగొట్టుకుందిగా!

సుధీర్ బాబు రష్మీ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. గెస్ట్ గా వచ్చిన సుధీర్ బాబును రష్మీ స్టేజి పైకి ఆహ్వానించింది. అయితే గతంలో సుధీర్ బాబు 'ప్రేమకథా చిత్రం' అనే హారర్ కామెడీ జోనర్ లో నటించిన సంగతి తెలిసిందే.

Written By: S Reddy, Updated On : May 30, 2024 9:21 am

Sridevi Drama Company

Follow us on

Sridevi Drama Company: రష్మీ గౌతమ్ యాంకర్ గా ఉన్న శ్రీదేవి డ్రామా కంపెనీ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. జబర్దస్త్ కమెడియన్స్ ఇందులో కూడా అదే తరహా కామెడీ పండిస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో మరో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తో సిద్ధమైంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా యంగ్ హీరో సుధీర్ బాబు హాజరయ్యారు. తన కొత్త సినిమా ‘ హరోం హర ‘ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేశారు.

ఈ క్రమంలో సుధీర్ బాబు రష్మీ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. గెస్ట్ గా వచ్చిన సుధీర్ బాబును రష్మీ స్టేజి పైకి ఆహ్వానించింది. అయితే గతంలో సుధీర్ బాబు ‘ప్రేమకథా చిత్రం’ అనే హారర్ కామెడీ జోనర్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఒక చిన్న పాప సుధీర్ బాబుతో… దెయ్యం ఎక్కడ అని అడిగింది. దీనికి ఆయన చాలా స్పాంటేనియస్ గా సమాధానం చెప్పారు.

ఒక దెయ్యం ఇక్కడ ఉంటే మరో దెయ్యం రాదు అమ్మా.. అని చిన్నారితో చెప్పాడు. వెంటనే రష్మీ ఎక్కడో నేను బుక్ అయ్యాను అనిపిస్తోంది అని డౌట్ గా స్పందిస్తుంది. నేనేమీ అనలేదు మీరే ఫీలయ్యారు అంటూ సుధీర్ బాబు రష్మీని ఇరికించేశాడు. దీంతో రష్మీ బిత్తర చూపులు చూస్తూ షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. మొత్తానికి ఇన్ డైరెక్ట్ గా రష్మీ దెయ్యం అని చెప్పారు సుధీర్ బాబు. అయితే సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘ హరోం హర ‘ జూన్ 14న రిలీజ్ అవుతుంది.

ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జ్ఞానశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. చిత్తూరు నేపథ్యంలో జరిగిన ఒక పీరియాడిక్ డ్రామా ఇది. సుధీర్ బాబుకు మంచి హిట్ పడి చాలా కాలం అవుతుంది. హరోం హర మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని సుధీర్ బాబు పట్టుదలతో ఉన్నారు. ఆయనకు విజయం దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.