Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు సినిమా వచ్చేది అప్పుడేనా..?

ప్రస్తుతం జనసేన పార్టీ పెట్టి పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికి ఆ పార్టీని నడపడానికి ఫండ్స్ కావాలి కాబట్టి సినిమాలను మాత్రం వదలకుండా సంవత్సరానికి ఒక సినిమాని అయిన రిలీజ్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగుతున్నాడు.

Written By: Gopi, Updated On : May 30, 2024 9:16 am

Hari Hara Veera Mallu

Follow us on

Hari Hara Veera Mallu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన చాలా తక్కువ సమయం లోనే మంచి సినిమాలు చేసి తనను తాను చాలా ప్రత్యేకంగా నిలుపుకోవడమే కాకుండా ఆయన మేనరిజమ్స్ తో తెలుగు ప్రేక్షకులందర్నీ మైమరిపింపజేశాడు. చిరంజీవి తమ్ముడిగా ఎదగడమే కాకుండా చిరంజీవికి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం జనసేన పార్టీ పెట్టి పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికి ఆ పార్టీని నడపడానికి ఫండ్స్ కావాలి కాబట్టి సినిమాలను మాత్రం వదలకుండా సంవత్సరానికి ఒక సినిమాని అయిన రిలీజ్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇందులో ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ సినిమా యూనిట్ అయితే అనౌన్స్ మెంట్ ఇచ్చినప్పటికీ ఆ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది అనే దానిమీద ఇంకా క్లారిటీ రావడం లేదు.

అయితే ఈ సినిమాని అనుకున్న టైమ్ కి కనక రిలీజ్ చేసినట్లైతే హరిహర వీరమల్లు సినిమాని ఈ ఇయర్ ఎండింగ్ లో గాని 2025 స్టార్టింగ్ లో గాని రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాని స్టార్ట్ చేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఈ సినిమా గురించి ఎదురు చూసి ఓపిక నశించిపోతుంది.

అలాగే ప్రొడ్యూసర్ రత్నం కూడా ఈ సినిమా కోసం ఇంకొక 25 రోజులు షూట్ డేట్స్ బ్యాలెన్స్ గా ఉండిపోయాయని ఆ రోజులను కనుక పూర్తి చేసినట్లైతే సినిమా పూర్తి అయిపోతుంది అంటూ తను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఒక 25 రోజుల పాటు తన డేట్స్ ని ఈ సినిమా మీద కేటాయించినట్లైతే సినిమా పూర్తి అయిపోయి రిలీజ్ కూడా అవుతుందనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది…