Indraja: ఇంద్రజ జబర్దస్త్ వదిలేస్తే… ఆమె స్థానంలోకి వచ్చేది ఎవరు?

ఇంద్రజ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. యమలీల సినిమాతో ఇంద్రజ భారీ హిట్ సొంతం చేసుకుంది. ఆ పాత్ర సౌందర్య చేయను అనడంతో ఇంద్రజకు అవకాశం వచ్చింది.

Written By: S Reddy, Updated On : June 7, 2024 5:17 pm

Indraja

Follow us on

Indraja: నటి ఇంద్రజ జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి అత్యంత పాప్యులర్ షోలకు జడ్జి గా వ్యవహరిస్తోంది. అయితే ఇంద్రజ జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నారు. కొంతకాలం బుల్లితెరకు దూరం అవుతున్నట్లు స్వయంగా ఇంద్రజ తెలిపారు. అనూహ్యంగా ఆమె జబర్దస్త్ షో ఎందుకు వీడారనే అనుమానాలు మొదలయ్యాయి . ఈ క్రమంలో ఇంద్రజ జబర్దస్త్ కి గ్యాప్ తీసుకోవడానికి వెనకున్న అసలు కారణం బయటకు వచ్చింది.

ఇంద్రజ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. యమలీల సినిమాతో ఇంద్రజ భారీ హిట్ సొంతం చేసుకుంది. ఆ పాత్ర సౌందర్య చేయను అనడంతో ఇంద్రజకు అవకాశం వచ్చింది. యమలీల బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. కాగా పెళ్లి తర్వాత ఇంద్రజ సినిమాలకు దూరం అయ్యారు. కొన్నేళ్ల అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మరోవైపు బుల్లితెర షోలకు జడ్జి గా చేస్తూ హవా సాగిస్తుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఆమెను బుల్లితెర ప్రేక్షకుల్లో పాప్యులర్ చేశాయి.

అయితే గతంలో రోజా, నాగబాబు జడ్జిలుగా ఉన్నారు. విబేధాలతో నాగబాబు జబర్దస్త్ మానేశారు. ఆ తర్వాత మంత్రి కావడంతో రోజా కూడా షో నుండి వెళ్ళిపోయింది. ఆమె స్థానంలో ఇంద్రజ జడ్జి గా వచ్చింది. తక్కువ సమయంలోనే ఇంద్రజ ఫేమ్ రాబట్టింది. రోజాను కూడా మరిపించేలా చేసింది. అయితే ఇప్పుడు సడన్ గా ఇంద్రజ జబర్దస్త్ మానేస్తున్నానంటూ షాక్ ఇచ్చింది.

మరి ఇంద్రజ జబర్దస్త్ మానేస్తే నెక్స్ట్ ఎవరు? అనే చర్చ మొదలైంది. జబర్దస్త్ జడ్జి స్థానంలోకి చాలా మంది మాజీ హీరోయిన్స్ వచ్చారు. ఈ లిస్ట్ లో మీనా, కుష్బూ, ఆమని, శ్రద్ధా దాస్ తో పాటు పలువురు ఉన్నారు. రోజా స్థాయిలో ఎవరు సక్సెస్ కాలేదు. ఇంద్రజ మాత్రమే కొంత మేర రోజా స్థాయిని అందుకుంది. ప్రస్తుతం కుష్బూ కొంత మేర యాక్టివ్ గా ఉంటున్నారు . ఆమె జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతున్నారు. ఆమెనే కొనసాగిస్తారా? లేక మరొకరిని తీసుకోస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. రోజా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఆమె రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.