https://oktelugu.com/

Kurchi Thatha: రేవ్ పార్టీలో బట్టలు తీసేస్తారా? కుర్చీ తాత బయటపెట్టిన భయంకర నిజాలు!

గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రెమండస్ సక్సెస్ అందుకుంది. ఆ విషయం పక్కన పెడితే... తాజాగా కుర్చీ తాత బెంగళూరు రేవ్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు సౌత్ ఇండియాలో సెన్సేషన్ గా మారింది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 7, 2024 / 05:15 PM IST

    Kurchi Thatha

    Follow us on

    Kurchi Thatha: ఒకే ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాని షేక్ చేశాడు కాలా పాషా అలియాస్ కుర్చీ తాత. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుర్చీని మడతపెట్టి అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. పలు యూట్యూబ్ ఛానల్స్ కుర్చీ తాత వెంటపడి మరీ ఇంటర్వ్యూలు చేశాయి. దాంతో ఆయన మరింత ఫేమస్ అయ్యాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కుర్చీ తాత ఐకానిక్ డైలాగ్ ‘కుర్చీ మడతపెట్టి’ గుంటూరు కారం సినిమాలోని ఓ పాటకు వాడేశాడు.

    గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రెమండస్ సక్సెస్ అందుకుంది. ఆ విషయం పక్కన పెడితే… తాజాగా కుర్చీ తాత బెంగళూరు రేవ్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు సౌత్ ఇండియాలో సెన్సేషన్ గా మారింది. నటి హేమ రేవ్ పార్టీకి హాజరై అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆమెకు న్యాయస్థానం జూన్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రెండుసార్లు పోలీసులు నోటీసులు పంపించినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. మూడోసారి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు.

    హేమ ఉదంతం పై తాజా ఇంటర్వ్యూలో కుర్చీ తాత మాట్లాడుతూ .. ”రేవ్ పార్టీకి నేను రెండు సార్లు వెళ్ళాను. రాత్రి 11.30 అయ్యిందంటే పార్టీకి వచ్చిన వారి ఒంటిపై బట్టలు ఉండవు. ఆడుతూ, పడుతూ ఎంజాయ్ చేస్తారు. కట్టలు, కట్టలు డబ్బులు తీసి చల్లుతారు. నేను సిగరెట్ కాల్చి, మందు తాగి ఓ మూలన కూర్చున్నాను. ఇంతలో ఒక పాప వచ్చి ఏం తాత డాన్స్ చేయవా అని అడిగింది. ఆ గోల చూసి తట్టుకోలేక నేను పారిపోయి వచ్చేశాను”, అన్నాడు.

    కుర్చీ తాత ఇంకా మాట్లాడుతూ .. ”ఏ ఆడపిల్ల రోడ్డెక్కదు. తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త సరిగా పట్టించుకోకపోవడం వల్ల .. లేదంటే ఇంకేమైనా కారణం వల్లనో ఆడపిల్ల రోడ్డెక్కుతుంది. ఎవరైనా ఆడపిల్లను నా కళ్ళముందు ఏడిపిస్తుంటే అసలు ఊరుకోను. ఇంటికెళ్లి మరీ కొడతా” అంటూ కుర్చీ తాత చెప్పుకొచ్చాడు.