https://oktelugu.com/

Hyper Aadi: జబర్దస్త్ షో వలన హైపర్ ఆది అంత సంపాదించాడా? ఆస్తుల వివరాలు బయటపెట్టిన బుల్లితెర స్టార్!

హైపర్ ఆది మాట్లాడుతూ ..జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలో మా ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయింది. జాబ్ చేయడం ఇష్టం లేక మానేస్తున్నానని ఇంట్లో చెబితే తల్లిదండ్రులు అసలు ఊరుకోలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 22, 2024 / 09:19 AM IST

    Hyper Aadi

    Follow us on

    Hyper Aadi: హైపర్ ఆది బుల్లితెర పై స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీ తరపున ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తన అభిమాన నటుడు, నాయకుడు పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు కష్టపడుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది అనసూయ తో తనకున్న అనుబంధం గురించి బయటపెట్టాడు. అనసూయ తో ఎక్కువగా స్కిట్స్ చేయడానికి అదే కారణం అని హైపర్ ఆది ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అలాగే తన ఆస్తుల గురించి ఓపెన్ అయ్యాడు.

    హైపర్ ఆది మాట్లాడుతూ ..జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలో మా ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయింది. జాబ్ చేయడం ఇష్టం లేక మానేస్తున్నానని ఇంట్లో చెబితే తల్లిదండ్రులు అసలు ఊరుకోలేదు. నాకు నచ్చిన పని చేయాలి. జబర్దస్త్ కి రావాలని ఫిక్స్ అయిన నేపథ్యంలో ఈ అప్పులు ఉండకూడదని అనుకున్నాను. ఉన్న మూడు ఎకరాల పొలం అమ్మేసి అప్పులు కట్టేయమని ఇంట్లో చెప్పాను. ముందు ఎవరూ ఒప్పుకోలేదు.

    అతికష్టం మీద ఒప్పించి అప్పు కట్టేసి .. ఆ పాజిటివ్ మైండ్ తో జబర్దస్త్ కి వచ్చాను. జబర్దస్త్ లో సక్సెస్ అయ్యాక ఎంత ఆస్తి అమ్మానో అంతకి కొన్ని రెట్లు ఎక్కువ ఆస్తిని కొన్నామని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. అనంతరం అనసూయ గురించి మాట్లాడుతూ .. మా ఇద్దరికీ మంచి రాపో ఉంది. అనసూయ కి తెలుగు మీద బాగా పట్టుంది. కాబట్టి నేను చెప్పే ప్రతి డైలాగ్ ని అర్థం చేసుకునేది. కావాల్సిన రియాక్షన్ ఇచ్చేది.

    ఆమెకి కౌంటర్లుగా స్కిట్ రాసుకునేవాడిని. ఆమెకు ప్రతి స్కిట్ ముందే చెప్పేవాడిని. నేను తలకు గుడ్డ కట్టుకుని అపురూపమైనదమ్మ ఆడజన్మ అంటూ ఓ స్కిట్ చేశా. దానికి రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది. దాదాపు 45 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తమ కాంబినేషన్ ని జనాలు ఇష్టపడటంతో ఎక్కువగా అనసూయతో స్కిట్లు చేసేవాడినని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.