Pawan Kalyan: అన్న చిరంజీవి పై ఈగ వాలనివ్వని పవన్ కళ్యాణ్

గత కొద్ది రోజులుగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల కిందట జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. జనసేనకు మద్దతుగా నిలవాలని అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.

Written By: Dharma, Updated On : April 22, 2024 9:26 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. వారికి ఓటేయాలని పిలుపునివ్వడంతో వైసీపీ అలెర్ట్ అయ్యింది.చిరంజీవి కూటమికి మద్దతు ఇవ్వడంపై సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఎదుట చిరంజీవిని తక్కువ చేసే ప్రయత్నం చేశారు.దీనిపై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.సజ్జల తీరును తప్పుపట్టారు.ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అధికార విపక్షాల మధ్య రచ్చకు కారణం అవుతున్నాయి.

గత కొద్ది రోజులుగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల కిందట జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. జనసేనకు మద్దతుగా నిలవాలని అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.ఈ తరుణంలో అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్,పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు చిరంజీవిని ప్రత్యేకంగా కలిశారు.దీంతో ఆయన వారిని ఆశీర్వదిస్తూ మద్దతు ప్రకటించారు. కూటమి నేతలను గెలిపించాలని మెగా అభిమానులతో పాటు ప్రజలకు పిలుపునిచ్చారు.దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. జగన్ ఒక్కరు చాలు..ఎవరి మాట ప్రజలు వినరని సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవిని పరోక్షంగా వైఫల్య నేతగా అభివర్ణించారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పవన్ పర్యటించారు.కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. అప్పుడే సజ్జల విషయం ప్రస్తావించారు. చిరంజీవి ఆజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు.రాష్ట్ర ప్రజల జోలికి,చిరంజీవి జోలికి, బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. వైసీపీ సింహం కాదు.. గుంట నక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం మదం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరంజీవి విషయంలో విమర్శలు వస్తే ముందుగా గుర్తుకొచ్చేది నాగబాబు. ఎవరైనా చిరంజీవిని విమర్శించినప్పుడు ఆయన ఎంటర్ అయ్యే వారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. చిరంజీవి పిఠాపురం పర్యటనకు వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో సైతం పవన్ ఆచితూచి వ్యవహరించేవారు. ఆయనంటే చాలా గౌరవం అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే సజ్జల చిరంజీవిని టార్గెట్ చేసుకోవడంతో పవన్ స్పందించాల్సి వచ్చింది. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే చిరంజీవి మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఇప్పుడు అధికార పక్షం చిరంజీవిని టార్గెట్ చేసుకోవడంతో.. మెగా అభిమానులంతా ఏకతాటిపైకి వస్తున్నారు. జనసేనకు ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారు.