Anchor Sravanthi: యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి మీకు తెలిసే ఉంటుంది. అమ్ముడు గురించి ఈ మధ్య టాక్ ఎక్కువ వస్తుంది..యూట్యూబ్ లో యాంకరింగ్ చేస్తూ తన అందంతో మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూలో స్రవంతి మరింత పాపులారిటీని సంపాదించింది.
పుష్పు సినిమా విడుదల అవుతున్న సమయంలో ఈమె చిత్ర యూనిట్ తో ఓ ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ అయింది. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంతంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్ మారిపోయింది ఈ యాంకర్.అంతేకాదు తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో అసలు తగ్గించడం లేదు. ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదు.
రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుతూ.. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపులో రచ్చ చేస్తుంది. అయితే స్రవంతి చొక్కారపు డ్రెస్సింగ్ స్టైల్ గురించి గతంలో ఆమె భర్త చేసిన కొన్ని కామెంట్లు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే స్రవంతి భర్త ప్రశాంత్ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా యాంకర్ స్రవంతి డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఆమె భర్తను ప్రశ్నించారు. స్రవంతి డ్రెస్సింగ్ విషయంలో మీరు ఏమైన సలహాలు , సూచనలు ఇస్తుంటారా అని అడిగారు.
ఆయన మాట్లాడుతూ… తన విషయంలో కలుగజేసుకోనని..నేను చెప్పిన ఆమెకు పెద్దగా నచ్చదని తెలిపారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నాకు పెద్దగా ఐడియా లేదని, ఆ నిర్ణయం తనకే వదిలేశానని చెప్పుకొచ్చారు స్రవంతి భర్త. కొన్నిసార్లు చెప్పడం జరిగిందని..నా సూచనలు నచ్చలేదని.. అందుకే ఇక సలహాలు, సూచనలు ఇవ్వడం లేదని చెప్పారు.