Bigg Boss OTT Season 3: బిగ్ బాస్ హౌస్లో శృంగారం జరిపిన జంట, వీడియో లీక్… రంగంలోకి పోలీసులు, అసలు ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ హౌస్లో ప్రేమ కథలు కామన్. ఒంటరిగా వెళ్లి జంటలైన వారు ఉన్నారు. ఈ క్రమంలో ముద్దులు,హగ్గులు చోటు చేసుకుంటాయి. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఓ జంట శృంగారం చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Written By: S Reddy, Updated On : July 23, 2024 8:44 am

Bigg Boss OTT Season 3

Follow us on

Bigg Boss OTT Season 3: బిగ్ బాస్ రియాలిటీ షో కాన్సెప్ట్ మనది కాదు. బిగ్ బ్రదర్ పేరుతో బ్రిటన్ లో ప్రసారం అయ్యేది. ఈ బిగ్ బ్రదర్ షోలో వివిధ దేశాలకు చెందిన సెలెబ్స్ పోటీపడేవారు. ఇండియా నుండి హీరోయిన్ శిల్పా శెట్టికి అవకాశం దక్కింది. ఆమె బిగ్ బ్రదర్ షో విన్నర్ కావడం విశేషం. ఈ షోలో జేడ్ గూడి అనే మహిళ శిల్పా శెట్టి మీద చేసిన జాత్యహంకార కామెంట్స్ అప్పట్లో దుమారం రేపాయి.

ఈ షోకి ప్రతిరూపమే బిగ్ బాస్ షో. హీరోలు, హీరోయిన్స్ తో పాటు ఫేమస్ పర్సనాలిటీ ని ఒక ఇంట్లో ఉంచి వారి మధ్య గేమ్స్ , టాస్క్స్ పెట్టడం. అలాగే వారి నిజమైన ప్రవర్తన, వివిధ సందర్భాల్లో మాట్లాడే తీరు, వారి అలవాట్లు జనాలకు చూపించడమే బిగ్ బాస్ షోలో ఉన్న మజా. సాధారణంగా సెలెబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడాలని అందరికీ ఉంటుంది.

బిగ్ బాస్ షో ఒక పాపులర్ పెర్సనాలిటీ నిజ జీవితంలో ఎలా ఉంటాడో చూపిస్తుంది. ఇక సెలబ్రిటీ మధ్య వివాదాలు, గొడవలు, పోటీ ఆసక్తి రేపుతుంటాయి. ఈ కారణంగానే ఇండియాలో బిగ్ బాస్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. హిందీలో ప్రయోగాత్మకంగా మొదలైన బిగ్ బాస్ సూపర్ హిట్. దాంతో ఇతర ప్రాంతీయ భాషలకు పాకింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, బెంగాలీ భాషల్లో కూడా బిగ్ బాస్ షో అందుబాటులోకి వచ్చింది.

గత ఐదేళ్లుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఓటీటీ వెర్షన్ స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3 ఇటీవల జియో సినిమాలో స్టార్ట్ అయ్యింది. అర్మాన్ మాలిక్ అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలతో షోలో పాల్గొన్నాడు. భార్యాభర్తలు బిగ్ బాస్ షోలో పాల్గొనడం కామన్. కానీ ఇద్దరు భార్యలతో కంటెస్ట్ చేయడం ఇదే మొదటిసారి.

అర్మాన్ మాలిక్ భార్యల్లో ఒకరైన పాయల్ మాలిక్ ఎలిమినేట్ అయ్యింది. హౌస్లో అర్మాన్ మాలిక్, కృతిక మాలిక్ ఉన్నారు. వీరిద్దరూ ఒకే బెడ్ పై పడుకుంటున్నారు. ఈ క్రమంలో శృంగారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ పరిణామం పెద్ద వివాదానికి దారి తీసింది. అసలే బిగ్ బాస్ షో మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది. షో బ్యాన్ చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

తాజా ఘటనతో నిరసన జ్వాలలు మరింత రగులుకున్నాయి. కాగా బిగ్ బాస్ షోలో అర్మాన్ ఖాన్-కృతిక మాలిక్ శృంగారానికి పాల్పడిన నేపథ్యంలో కేసు నమోదు అయ్యింది. మహారాష్ట్ర లోని శివసేన(షిండే)నేత మనీషా కాయాండే బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3 పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ షోని పిల్లలు కూడా చూస్తారు. వారి మీద దుష్ప్రభావం పడే సూచనలు ఉన్నాయి. షోని రద్దు చేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3కి అనిల్ కపూర్ హోస్ట్ గా చేస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉండేవారు. భద్రతా కారణాల రీత్యా సల్మాన్ ఖాన్ షో నుండి తప్పుకున్నారు. కాగా ఎలిమినేట్ అయిన అర్మాన్ మాలిక్ భార్య పాయల్ మాలిక్ విడాకులకు సిద్దమైనట్లు తెలుస్తోంది.