https://oktelugu.com/

Plan to Weaken YCP in Council : శాసనమండలిలో వైసీపీ నిర్వీర్యం.. మూడు పార్టీల మైండ్ బ్లోయింగ్ ప్లాన్: శాసనమండలిలో వైసీపీ నిర్వీర్యం.. మూడు పార్టీల మైండ్ బ్లోయింగ్ ప్లాన్

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా.. శాసనమండలితో రాజకీయం చేయాలని జగన్ చూస్తున్నారు. కానీ శాసనమండలిలో వైసిపి బలాన్ని తగ్గించాలని కూటమి సర్కార్ భావిస్తోంది. వైసీపీని నిర్వీర్యం చేయాలని చూస్తోంది

Written By:
  • Dharma
  • , Updated On : July 23, 2024 12:11 pm
    Follow us on

    Plan to Weaken YCP in Council : శాసనమండలిలో వైసీపీ నిర్వీర్యం.. మూడు పార్టీల మైండ్ బ్లోయింగ్ ప్లాన్: వైసిపి ఎమ్మెల్సీలు పార్టీ మారనున్నారా? ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఈ మేరకు పావులు కదుపుతున్నారా? కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. కీలక బిల్లులకు ఆమోదం అవసరమయిన నేపథ్యంలో ఎమ్మెల్సీలను ఆకర్షించే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి దారుణ పరాజయం ఎదురు కావడంతో.. ఇక భవిష్యత్తు లేదని భావిస్తున్న ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    * మండలిలో వైసీపీ దే బలం శాసనమండలిలోఎమ్మెల్సీల సంఖ్య 58.వైసీపీకి 38 మంది సభ్యుల బలం ఉంది. ఆ పార్టీకి చెందిన మోసేన్ రాజు శాసనమండలి చైర్మన్ గా ఉన్నారు. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది వైసిపికి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డిని శాసనసభ పక్ష నేతగా నియమించారు జగన్. దీంతో అధికార టిడిపి తో తాడోపేడో అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అమరావతి రాజధాని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి బిల్లులు శాసనమండలికి రానున్నాయి. అక్కడ వైసిపికి సంఖ్యాబలం ఉండడంతో తప్పకుండా బిల్లులకు చుక్కెదురు అవుతుంది. అందుకే ఎమ్మెల్సీల విషయంలో కూటమి సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే వైసిపి నిర్వీర్యం చేసేందుకు.. మూడు పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదపాలన్నది ప్లాన్.

    * బిజెపిలోకి తోట త్రిమూర్తులు
    వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వైసీపీలో సీనియర్. ఆయనకు కాకుండా లేళ్ల అప్పి రెడ్డికి శాసనమండలి వైసిపి పక్ష నేతగా నియమించడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న తోట త్రిమూర్తులు బిజెపిలో చేరేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆయనను చేర్చుకుంటే పార్టీలో అసంతృప్తి బయటపడే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేనట్లు టాక్ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపిలో చేరితే సేఫ్ జోన్ లో ఉంటామని త్రిమూర్తులు భావిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ఆయన కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    * అసంతృప్త ఎమ్మెల్సీలు..
    వైసిపి హయాంలో చాలామంది అనామకులు సైతం ఎమ్మెల్సీలుగా పదవులు దక్కించుకున్నారు. సామాజిక సమీకరణల పేరిట చాలామంది నేతలకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఇలా పదవులు దక్కించుకున్న వారికి గత ఐదేళ్లుగా ప్రాధాన్యం అంతంత మాత్రమే. ఎక్కడికి అక్కడే ఎమ్మెల్యేలు ఉండడంతో ఎమ్మెల్సీలకు విధులు, నిధులు కూడా పెద్దగా కేటాయించలేదు. అటువంటి వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కూడా ఆశించారు. కానీ జగన్ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. పేరుకే పదవి కానీ ఎటువంటి అధికారం లేకుండా పోయిందని ఎక్కువమంది బాధపడుతున్నారు. అటువంటి వారు ఇప్పుడు కూటమిలోని మూడు పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో కూటమి సైతం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు సమాచారం. కొందర్ని టిడిపిలోకి, మరికొందరిని జనసేనలోకి, ఇంకొందరిని బిజెపిలో చేర్చుకొని శాసనమండలిలో వైసీపీని నిర్వీర్యం చేయాలన్నది ప్లాన్. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.