https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్లో అమర్ దీప్ వల్ల కానిది ఫ్రెండ్ చేయగలడా… పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు?

టైటిల్ ఫేవరేట్ గా హౌస్లో అడుగుపెట్టాడు అమర్ దీప్. అయితే రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. కాగా సీజన్ 8లో అమర్ దీప్ క్లోజ్ ఫ్రెండ్ హౌస్లో అడుగుపెడుతున్నాడట. అమర్ సాధించలేనిది అతడు చేయగలడా? అనే సందేహాలు మొదలయ్యాయి. అదే సమయంలో ఆ కంటెస్టెంట్ వస్తే ట్రోల్ చేయడానికి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 29, 2024 / 09:59 AM IST

    Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఆల్రెడీ ఆడియన్స్ లో బిగ్ బాస్ ఫీవర్ మొదలైపోయింది. షో రసవత్తంగా సాగేలా మేకర్స్ ప్రణాళికలు వేస్తున్నారట. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇచ్చే కాంట్రవర్సీ కంటెస్టెంట్స్ ని ఏరికోరి ఎంపిక చేస్తున్నారట. బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ పరిశీలిస్తే .. కుమారి ఆంటీ. సోనియా సింగ్, ఖయ్యూం ఆలీ, బమ్ చిక్ బబ్లు, యాదమరాజు, ఆర్టిస్ట్ హారిక, రీతూ చౌదరి, మై విలేజ్ షో అనిల్ వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

    Also Read: బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ అప్పుడే డిసైడ్ అయిపోయిందా..? అదే నిజమైతే చరిత్ర అవుతుంది!

    తాజాగా ఓ సీరియల్ నటుడి పేరు తెరపైకి వచ్చింది. స్టార్ మా సీరియల్ బ్యాచ్ లేకుండా బిగ్ బాస్ షో అంటే అది జరగని పని. ఖచ్చితంగా సీరియల్ ఆర్టిస్టులు కనీసం ఇద్దరు లేదంటే ముగ్గురు, ప్రతి సీజన్ లో ఉండాల్సిందే. గత సీజన్ లో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఎంత రచ్చ చేశారో తెలిసిందే. సీరియల్ బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్ మధ్య ఓ రేంజ్ లో పోరు సాగింది. ముఖ్యంగా అమర్ దీప్ – పల్లవి ప్రశాంత్ అయితే ఉప్పు నిప్పు లా ఉండేవారు.

    ఇద్దరికీ అస్సలు పడేది కాదు. అమర్ ఫ్యాన్స్ – ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకరినొకరు ఓ రేంజ్ లో ట్రోల్ చేసుకునేవారు. అమర్ కుటుంబ సభ్యులను కూడా మధ్యలోకి లాగి దారుణంగా దూషించడం, ట్రోల్ చేయడం వంటివి చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్. ఆ సమయంలో అమర్ దీప్ స్నేహితుడు నటుడు నరేష్ లొల్ల అమర్ కి చాలా సపోర్ట్ గా నిలిచాడు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేశాడు. ఫినాలే రోజున అమర్ కారుపై దాడి ఘటన అనంతరం నరేష్ లొల్ల సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

    పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి నా కొడకల్లారా ఎవరినీ వదలను .. అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నరేష్ లొల్ల బిగ్ బాస్ 8 లో పార్టిసిపేట్ చేస్తాడని న్యూస్ వైరల్ అవుతుంది. అదే కనుక జరిగితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నుంచి నరేష్ లొల్ల వ్యతిరేకత ఎదుర్కోవాల్సిందే. వారు కచ్చితంగా నరేష్ లొల్ల ను ట్రోల్ చేస్తారు. నరేష్ లొల్ల కారణంగా బిగ్ బాస్ హౌస్ లో రసవత్తర పోరు ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

    అదే సమయంలో అమర్ దీప్ బిగ్ బాస్ టైటిల్ ఫేవరేట్ గా హౌస్లో అడుగుపెట్టి విఫలం చెందాడు. ఒక దశలో టాప్ 5లో కూడా అమర్ దీప్ లేడు. ఫ్రస్ట్రేషన్, ఇన్నోసెన్స్ తో నవ్వుల పాలయ్యాడు. చివరి వారాల్లో కొంత మేర పుంజుకుని ఫైనల్ కి వెళ్ళాడు. టైటిల్ రేసులో నిలిచాడు. అమర్ దీప్ టైటిల్ కోల్పోయిన నేపథ్యంలో… కనీసం మిత్రుడు నరేష్ లొల్ల దాన్ని సాధిస్తాడా? అనే చర్చ నడుస్తుంది. అయితే నరేష్ లొల్ల బిగ్ బాస్ హౌస్లోకి వెళుతున్నాడు అనేది కేవలం ఊహాగానం మాత్రమే.

    Also Read: ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. వీడియో లీక్ పై ఊర్వశి రౌతేలా ఓపెన్ కామెంట్స్! వివాదం ఏమిటంటే?