Mokshagna Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఫ్యామిలీ బాధ్యతలను బాలకృష్ణ మోస్తున్నాడు. ఇక తనతో పాటుగా ఈ జనరేషన్ లో నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళుతున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉన్నాడు… ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన నందమూరి ఫ్యామిలీ మొత్తానికి తనే వారసుడిగా ఉంటూ ప్రేక్షకుల్లో ఆ ఫ్యామిలీ తాలూకు ఎమోషన్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకుంటూనే, వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ అభిమానుల్లో మంచి జోష్ నింపుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య తన కొడుకు అయిన మోక్షజ్ఞని మూడోవ తరం నందమూరి నట వారసుడిగా దింపే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ ప్రయత్నం దాదాపు రెండు సంవత్సరాల నుంచి సాగుతున్నప్పటికీ ఇప్పటివరకు మోక్షజ్ఞ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. మరి ఎందుకు ఇంతలా డిలే చేస్తున్నారు అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. మొదట్లో మోక్షజ్ఞ కి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు అని కొన్ని కామెంట్లైతే వచ్చాయి. కానీ ప్రస్తుతం మోక్షజ్ఞ మేకోవర్ ను కనక మనం చూసినట్లయితే ఆయనకు ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఉండటం తో పాటుగా చాలా స్లిమ్ గా తయారయ్యాడు. అలాగే బాడీని సైతం చాలా ఫిట్ గా చేసుకుని సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మరి ఇలాంటి క్రమంలో మోక్షజ్ఞ ఇండస్ట్రీకి వచ్చి తన నట విశ్వరూపాన్ని చూపించి ఎన్టీఆర్ తో పాటు తను కూడా నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లగలుగుతాడా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
Also Read: బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ అప్పుడే డిసైడ్ అయిపోయిందా..? అదే నిజమైతే చరిత్ర అవుతుంది!
ఇక మొత్తానికైతే ప్రస్తుతం మోక్షజ్ఞ మొదటి సినిమా ఎలా ఉండబోతుందనే దాని మీదనే ప్రేక్షకులు చాలా అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ చిరుత సినిమాలో ఆయన ఇంట్రాడక్షన్ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. పూరి జగన్నాథ్ మేకింగ్ కి రామ్ చరణ్ స్టైల్ తొడవ్వడంతో ఆ సీన్ చాలా బాగా ఎలివేట్ అయింది. ఇక అదే విధంగా సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ కూడా ఆ లెవెల్ లో ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక చిరుత సినిమాతో రామ్ చరణ్ భారీ సక్సెస్ ని కొట్టి తండ్రికి తగ్గ తనయుడుగా ఎదిగాడు.
మరి మోక్షజ్ఞ కూడా బాలయ్య బాబు నట వారసత్వాన్ని ముందుకు కొనసాగిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దానికంటే ఆయన ఇంట్రాడక్షన్ సీన్ లో ఎలా కనిపించబోతున్నాడు అనేదే ఇప్పుడు ప్రేక్షకుల్లో ఎక్కువ క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది…
ఇక మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరితో చేస్తాడు ఎలాంటి జానర్ లో చేస్తాడు అనే విషయాలు తెలిస్తే గాని ఆయన సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక అంచనాకైతే రాలేము అంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఇక మొత్తానికైతే నందమూరి నటసింహాం బాలయ్య బాబు వారసుడు సక్సెస్ అవుతాడా లేదంటే మిగిలిన కొంతమంది నందమూరి వారసుల లాగే ఫేడౌటైపోతాడా అనేది తెలియాల్సి ఉంది…
Also Read: ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. వీడియో లీక్ పై ఊర్వశి రౌతేలా ఓపెన్ కామెంట్స్! వివాదం ఏమిటంటే?