Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లవర్స్ కి భారీ షాక్… సమస్యల్లో సీజన్ 8, తలపట్టుకుంటున్న మేకర్స్!

సీజన్ 7లో ఉల్టా ఫల్టా కాన్సెప్ట్ అంటూ ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. రెండు లాంచింగ్ ఎపిసోడ్స్ నిర్వహించారు. ఏకంగా ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. పవర్ అస్త్రా, ఫినాలే అస్త్రా అంటూ ఏవేవో ప్రయోగాలు చేశారు. ఎలిమినేట్ అయిన రతిక రోజ్ కి మరో ఛాన్స్ ఇచ్చారు. మొత్తంగా షో సక్సెస్ చేశారు.

Written By: S Reddy, Updated On : July 19, 2024 3:31 pm

Bigg Boss 8 Telugu

Follow us on

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడు సీజన్స్ గ్రాండ్ సక్సెస్. ఒక్క సీజన్ 6 మాత్రం నిరాశపరిచింది. ఆశించిన స్థాయిలో టీఆర్పీ రాబట్టలేకపోయింది. ఆడియన్స్ సైతం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. రొటీన్ కంటెంట్, గేమ్స్ , టాస్క్స్, ఎలిమినేషన్స్ కారణంగా బోరింగ్ గా సాగింది. సీజన్ 6 ఫెయిల్యూర్ నుండి పాఠాలు నేర్చుకున్న బిగ్ బాస్ మేకర్స్ సరికొత్తగా సీజన్ 7 రూపొందించి సక్సెస్ అయ్యారు.

సీజన్ 7లో ఉల్టా ఫల్టా కాన్సెప్ట్ అంటూ ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. రెండు లాంచింగ్ ఎపిసోడ్స్ నిర్వహించారు. ఏకంగా ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. పవర్ అస్త్రా, ఫినాలే అస్త్రా అంటూ ఏవేవో ప్రయోగాలు చేశారు. ఎలిమినేట్ అయిన రతిక రోజ్ కి మరో ఛాన్స్ ఇచ్చారు. మొత్తంగా షో సక్సెస్ చేశారు. సీజన్ 7 సక్సెస్ కిక్ లో ఉన్న మేకర్స్ సీజన్ 8కి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మాణం కూడా మొదలైందట.

కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే కాస్త పేరున్న టాప్ సెలెబ్స్ హౌస్లోకి వచ్చేందుకు ససేమిరా అంటున్నారట. మంచి రెమ్యూనరేషన్ ఇస్తామన్నా వెనకాడుతున్నారట. అందుకు బలమైన కారణమే ఉందని అంటున్నారు. బిగ్ బాస్ షో వలన మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని చాలా మంది భావన. అందుకు గతంలో టైటిల్స్ గెలిచిన విన్నర్స్, కంటెస్టెంట్స్ కెరీర్స్ ని ఉదహరిస్తున్నారు.

ఫస్ట్ సీజన్ టైటిల్ గెలిచిన శివ బాలాజీ అడ్రస్ లేడు. అతనికి కనీసం అడపాదడపా అవకాశాలు కూడా లేవు. సీజన్ 2 విన్నర్ కౌశల్ పరిస్థితి కూడా సేమ్. రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ఫార్మ్ లో ఉన్నాడు. స్వతహాగా ఆయనకు సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అతడి కెరీర్ కి ఢోకా లేదు. అభిజీత్, సన్నీ, సింగర్ రేవంత్ ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కొందరు అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్నారు. కొందరైతే పరిశ్రమలో మనుగడ కోల్పోయారు.

నటులను తెరపై చూసి వారి పై ప్రేక్షకులు ఒక అవగాహన ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా పాజిటివ్ రోల్స్ చేసే వాళ్ళ మీద ఇష్టం పెంచుకుంటారు. నిజ జీవితంలో కూడా వారు అలానే ఉంటారని భావిస్తారు. బిగ్ బాస్ హౌస్లో వారి నిజ స్వరూపం ఏమిటో చూపిస్తారు. ఒక్కసారిగా వాళ్ళ మీద ప్రేక్షకులకు అభిప్రాయం మారిపోతుంది. చాలా పాజిటివ్ కోణంలో గేమ్ ఆడదామన్నా మేకర్స్ ఊరుకోరు. గేమ్స్, టాస్క్స్ కారణంగా.. తిట్టడం, ద్వేషించడం లాంటివి చేయాలి.

అసలు ఎడిటింగ్ టెక్నీక్స్ తో బిగ్ బాస్ నిర్వాహకులు కొందరు కంటెస్టెంట్స్ నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తారనే వాదన ఉంది. పలువురు కంటెస్టెంట్స్ హౌస్ నుండి బయటకు వచ్చాక చెప్పిన సందర్భాలు ఉన్నాయి. డబ్బులకు ఆశపడి బిగ్ బాస్ షోకి వెళితే కెరీర్ కి ప్లస్ కాకపోగా మైనస్ అవుతుంది. దర్శక నిర్మాతలు పక్కన పెడుతున్నారు. ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.

బాగా తెలిసిన సెలెబ్స్ ని హౌస్లోకి పంపి షోని మరింత సక్సెస్ చేయాలని భావించిన బిగ్ బాస్ మేకర్స్ కి షాక్ తగిలిందట. పేరున్న నటులు, కమెడియన్స్ మేము రామని చెప్పేస్తున్నారట. దీంతో పెద్దగా పేరు లేని సోషల్ మీడియా స్టార్స్, బుల్లితెర కమెడియన్స్ తో బిగ్ బాస్ 8 లాగించేసే ఆస్కారం కలదంటున్నారు. ఇది ఫ్యాన్స్ ని నిరాశపరిచే అంశమే.