Karthika Deepam Serial: బుల్లితెరపై ఎవర్ గ్రీన్ సీరియల్ ‘కార్తీకదీపం’. సాయంత్రం 7.30 అవుతుందంటే చాలు అందరూ మాటీవీకి అతుక్కుపోతారు. వంటలక్క కన్నీళ్లకు కరిగిపోతారు. ఆమెకు న్యాయం కోసం డాక్టర్ బాబును నిలదీస్తున్నారు. వంటలక్క-డాక్టర్ బాబు కలవాలని పెద్ద యుద్ధాలే జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సంఘాలు సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతమే చేశాయి.

ఈ క్రమంలోనే వీరి ఏడుపులు పెడబొబ్బలకు ఫుల్ స్టాప్ పడబోతోంది. కార్తీక దీపం సీరియల్ ను ఎట్టకేలకు 1800 ఎపిసోడ్స్ తర్వాత ఎండ్ చేయబోతున్నారు. దాదాపు ఐదారేళ్లుగా కొనసాగిన ఈ షోకు ముగింపు పలకబోతున్నారు. ఇక నుంచి వంటలక్క-డాక్టర్ బాబులు కనిపించరు. వారితోపాటు కూతురు హిమను కారు యాక్సిడెంట్ లో చంపేయబోతున్నారు. ఇక నుంచి వారి వారసులైన పిల్లలు.. కొత్త క్యారెక్టర్స్ తో సరికొత్తగా ఈ సీరియల్ ను మలచబోతున్నారు. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబులు, హిమలు ఉండరు. మౌనిత క్యారెక్టర్ ను, వంటలక్క మామ ఆనందరావును లేపేయబోతున్నారట..
Also Read: Mahesh Trivikram Movie: మహేష్ బాబు’ మరదలిగా ప్రముఖ హీరో కుమార్తె
దీంతో ఇక వంటలక్క ఫ్యాన్స్ అంతా ఈ విషయం తెలిసి ఆందోళన బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఆమె లేని ‘కార్తీక దీపం’ సీరియల్ ను జనాలు చూస్తారా? కొనసాగిస్తారా? నవతరం వాళ్లతో ఈ సీరియల్ నడుస్తుందా? అంటే డౌటే. ఇన్నాళ్లు కష్టాల కడగండ్లతో సాగిన వంటలక్క జీవితం ఇప్పుడే కుదటపడి సెకండ్ హనీమూన్ కు కూడా ఈ జంట వచ్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి వారిని చంపేయాడాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు జీర్ణించుకుంటారో వేచిచూడాలి.
Also Read: Thaman NTR Movie: థమన్ కోసం పట్టుబట్టిన ఎన్టీఆర్
వంటలక్క మరణం ఖచ్చితంగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు షాకింగ్ యే.. ఇన్నాళ్లుగా వారిద్దరూ కలుసుకోవాలని పోరాటాలు చేసి ఏడ్చి గోల చేసిన వారంతా ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

