https://oktelugu.com/

Akhil Agent Release Date: ఆగస్టు 12న రానున్న ఏజెంట్.. అఖిల్ కోరిక తీరుస్తాడా ?

Akhil Agent Release Date: దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో భారీ కసరత్తులు చేయిస్తున్నాడు. కాగా ‘ఏజెంట్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు రాగా.. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏజెంట్ సినిమా ఆగస్టు 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు మిషన్ గన్ పట్టుకొని ఉన్న అఖిల్ మాస్ లుక్ ఫోటోను […]

Written By:
  • Shiva
  • , Updated On : March 11, 2022 / 05:46 PM IST
    Follow us on

    Akhil Agent Release Date: దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో భారీ కసరత్తులు చేయిస్తున్నాడు. కాగా ‘ఏజెంట్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు రాగా.. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏజెంట్ సినిమా ఆగస్టు 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు మిషన్ గన్ పట్టుకొని ఉన్న అఖిల్ మాస్ లుక్ ఫోటోను రిలీజ్ చేసింది.

    Akhil Agent Release Date

    కాగా రీసెంట్ గా మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆయన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో అఖిల్‌ కు జంటగా సాక్షి వైద్య నటిస్తుంది. ఈ సినిమాలో అఖిల్ ది మొదట సిక్స్ ప్యాక్ అన్నారు. ఆ తర్వాత అంతకు మించి అంటున్నారు. దానికి తగ్గట్టుగానే అఖిల్ కూడా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అఖిల్ కొత్త లుక్ చాలా వైల్డ్ గా ఉంది.

    Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

    తన నరాలు కూడా ఎముకలు లాగా బలంగా లావుగా కనిపించేంతగా అఖిల్ ఈ సినిమా కోసం బాడీని పెంచాడు. నిజానికి అఖిల్ చాలా కాలంగా జిమ్ కే ఎక్కువ టైమ్ కేటాయించాడు. అయితే, అఖిల్ అక్కినేని ఎంత కష్టపడినా ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఓ ఏవరేజ్ హిట్ ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ సినిమాకు కూడా థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.

    Akhil Agent Release Date

    దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడు. అయితే, ఆ నిరాశ నుంచి త్వరగా బయటకు వచ్చేసి మొత్తానికి తన కొత్త సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. కాగా తన కష్టానికి తగ్గట్టుగానే ఈ ఏజెంట్ సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు. అఖిల్ మార్కెట్ స్థాయి కంటే రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారు. మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో సైరా తీసిన సురేందర్ రెడ్డి ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాడు. మరి ఇప్పుడు అఖిల్ తో కూడా సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ ను పెట్టిస్తున్నాడు.

    మరి ఈ బడ్జెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అయినా కండలతో పాటు బడ్జెట్ కూడా పెంచితే కష్టం అని ఎందుకు అర్థం కావడం లేదో ?. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    Also Read:  క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తిన రష్మీ గౌతమ్

     

    Tags