https://oktelugu.com/

Sonali Bendre: క్యాన్సర్‌ ను జయించిన తర్వాత ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోన్న హీరోయిన్

Sonali Bendre: వెండితెర పై తమ అభినయంతో ప్రేక్షకులకు కనువిందు కలిగించే అందాల తారల వెనుక బాధాకరమైన అనారోగ్య సమస్యలుంటాయి. వారికీ చెప్పుకోలేని చాలా బాధలు ఉంటాయి. అయితే, నిత్యం అందం కోసం యోగాలు, ఫిట్నెస్ మంత్రాలు వల్లించే హీరోయిన్ కూడా ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడటం.. సినీ లోకాన్నే షాక్ కి గురి చేసింది. అయితేనేం.. ఆమె ఆ బాధల వలయంలో నుంచి త్వరగా బయట పడింది. మళ్లీ విజయాల పయనంలో సగర్వంగా నిలబడింది. ఆమెనే […]

Written By:
  • Shiva
  • , Updated On : March 11, 2022 / 06:29 PM IST
    Follow us on

    Sonali Bendre: వెండితెర పై తమ అభినయంతో ప్రేక్షకులకు కనువిందు కలిగించే అందాల తారల వెనుక బాధాకరమైన అనారోగ్య సమస్యలుంటాయి. వారికీ చెప్పుకోలేని చాలా బాధలు ఉంటాయి. అయితే, నిత్యం అందం కోసం యోగాలు, ఫిట్నెస్ మంత్రాలు వల్లించే హీరోయిన్ కూడా ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడటం.. సినీ లోకాన్నే షాక్ కి గురి చేసింది. అయితేనేం.. ఆమె ఆ బాధల వలయంలో నుంచి త్వరగా బయట పడింది.

    Sonali Bendre

    మళ్లీ విజయాల పయనంలో సగర్వంగా నిలబడింది. ఆమెనే హీరోయిన్ ‘సోనాలి బింద్రే’. పాన్ ఇండియా స్థాయిలో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ‘సోనాలి బింద్రే’ గ‌తంలో హై గ్రేడ్ క్యాన్స‌ర్ తో బాధప‌డింది. క్యాన్సర్‌ను జయించాలంటే మూడు కావాలి. మొదటిది ఆత్మవిశ్వాసం. రెండు కుటుంబం సపోర్ట్‌. మూడు వైద్యం.

    Also Read:  వంటలక్క కోసం ఆందోళనకు సిద్ధమవుతున్న బుల్లితెర ఫ్యాన్స్ 

    అయితే, ఎంత నాణ్యమైన వైద్యం అందించినా.. అలాగే ఆత్మవిశ్వాసాన్ని బలవంతంగా కూడగట్టుకున్నా.. కుటుంబం సపోర్ట్‌ లేనిది ఆ మహమ్మారిని జయించలేరు. కాగా, ‘సోనాలి బింద్రే’కి హై గ్రేడ్ క్యాన్స‌ర్ వచ్చిన సమయంలో ఆమె చాలా బలహీన పడిపోయింది. ధైర్యం చెప్పింది ఒక్కరే. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ ‘సోనాలి బింద్రే’ విజయం వెనుక ఆమె భర్త ‘గోల్డీ బెహల్’ కష్టం ఉంది, అతని త్యాగం ఉంది.

    వైద్యం ఎలాగూ మేలు చేస్తుంది. కానీ తాను ధైర్యం కూడగట్టుకుని తన సతీమణికి ధైర్యాన్ని నూరిపోశాడు గోల్డీ బెహల్. తాజాగా తన కష్టకాలంలో తన భర్త తనకు అండగా నిలిచిన విధానం గురించి ‘సోనాలి బింద్రే’ మాట్లాడుతూ.. క్యాన్సర్ జయించేటప్పుడే కాదు, జయించిన తర్వాత కూడా నా భర్త నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. తిరిగి నేను యాక్టివ్ కావడానికి కారణం నా భర్తే. ఆయనే నన్ను ప్రోత్సహిస్తున్నారు.

    చాలా విరామం తర్వాత నేను బిజీ అయ్యాను అంటే అది గోల్డీ బెహల్ గొప్పతనం. ప్రస్తుతం సోనాలి ఇప్పుడు రియాలిటీ టెలివిజన్ షో ‘డాన్స్ ఇండియా డ్యాన్స్ లిల్ మాస్టర్స్ సీజన్ 5’లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. అన్నట్టు తెలుగు సినిమాల్లో కూడా ఆమె త్వరలోనే కనిపించనుంది.

    Sonali Bendre

    ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో ‘సోనాలి బింద్రే’ ఒక కీలక పాత్రలో నటించబోతుంది. టాలీవుడ్ కి ‘సోనాలి బింద్రే’కి మంచి అనుబంధం ఉంది. ఆమె గతంలో అనేక మంచి చిత్రాల్లో నటించి మెప్పించింది.

    తెలుగులో సోనాలి బింద్రే చేసిన సినిమాల్లో ముఖ్యంగా ‘మ‌న్మ‌థుడు, మురారి, ఖ‌డ్గం తో పాటు శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. మ‌న్మ‌థుడు చిత్రం విడుదల అయిన రోజుల్లో.. సోనాలి బింద్రే కొన్నాళ్ళు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ పొజిషన్ ను కూడా సొంతం చేసుకుంది. మరి ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ కూడా విజయవంతం కావాలని మా ‘ఓకేతెలుగు’ తరఫున కోరుకుంటున్నాం.

    Also Read:  క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తిన రష్మీ గౌతమ్

    Tags