Telugu Indian Idol: వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుుతోనే మొదలుపెడతాం. మోచేతిలో బలముంటే మొండి కొడవలైనా తెగుతుంది అంటారు. అతడి స్వరం దేవుడిచ్చిన వరం. మధురమైన గొంతు ఉన్నా అవకాశాలు రాకపోతే అంతే. దానికి కూడా అదృష్టం ఉండాలి. లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా ఏదీ నీ దరికి రాదు. అదృష్టం ఉంటే ఏదైనా మనకు కలిసొస్తుంది. లేదంటే ఏదైనా దూరం వెళ్తుంది. ఇక్కడ అతడు ఓ గాయకుడు కావాలని నిత్యం కలలు కన్నాడు. అలాగని తన ప్రయత్నం మానలేదు. నిరంతరం కఠోర సాధన చేశాడు. చివరకు అనుకున్నది సాధించేందుకు ఇంకా కొద్ది దూరంలోనే ఉన్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కొడిమోజు మారుతి చిన్నప్పటి నుంచి తానో గాయకుడిని కావాలని కలలు కన్నాడు. కానీ చేతిలో చిల్లి గవ్వ లేదు. సంపాదన ఊసేలేదు. దీంతో ఎలా అనే ఆలోచనలో పడ్డాడు. చివరకు ఉన్న ఊరును వదిలి నగరం బాట పట్టాడు. ఒక్కడ ఓ హోటల్ లో బేరర్ గా చేరాడు. అయినా సంగీత సాధన మానలేదు. రఘు అనే వ్యక్తితో బాలసుబ్రహ్మణ్యానికి దగ్గరై సంగీతంలో మెలకువలు నేర్చుకున్నాడు.
Also Read: RRR: 33 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు !
ఉదయం కార్పెంటర్ గా పని చేసేవాడు. సాయంత్రం రెస్టారెంట్లో బేరర్ గా ఉద్యోగం చేస్తూనే తన సంగీత సాధన మాత్రం మరిచిపోయేవాడు కాదు. తోటివారు ఎంతో మెచ్చుకుని నువ్వు మ్యూజిక్ కాంపిటీషన్ కు వెళ్లు అని సలహా ఇచ్చేవారు. దీంతో ఆహా ఓటీటీ వారు నిర్వహించే ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లో ప్రవేశం చేశాడు. దీంతో వేలాది మందిలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికి 18 ఎపిసోడ్స్ అయిపోవడంతో ఇక 10 మాత్రమే మిగిలి ఉన్నాయి.
దీంతో తాను నెంబర్ వన్ గాయకుడిగా ఎదగాలనే అతడి సంకల్పం నెరవేరేందుకు అందరు సహకరించాలని కోరుతున్నాడు. అందులో తెలంగాణ నుంచి ఒక్క మారుతియే ఎంపిక కావడం గమనార్హం. సింగర్ కావాలని తపన ఉంటే సరిపోదు సాధన కూడా కావాలి. అప్పుడే జీవితంలో ఎదిగి అందరికి రోల్ మోడల్ గా మారే అవకాశం ఉంటుంది.
పేదరికం ఎదురైనా మారుతి మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని కలలు కన్నాడు. అందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. వచ్చే ఎపిసోడ్స్ లో కూడా తన సత్తా చాటి తానో నెంబర్ వన్ సింగర్ గా నిలవాలన్నదే మారుతి సంకల్పం.
పాటలు పాడటంలోనే అతడి భవితవ్యం ఆధారపడి ఉంది. జీవితంలో ఉన్నత శిఖరాలు ఎదగాలంటే కొన్ని వదులుకోక తప్పదు. మారుతి పేదరికమైనా తన కష్టాన్ని నమ్ముకున్నాడు. మూడు చోట్ల పనిచేస్తున్నా తన ప్రాక్టీసు మానలేదు. అకుంఠిత దీక్ష, అంతులేని ఆత్మవిశ్వాసమే అతడిని ముందుకు నడిపించాయి. సింగర్ గా ఎదిగేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మారుతి విషయం తెగ వైరల్ అవుతోంది. తన పాటల ద్వారా అందరిని సంతోషపెట్టాలని అతడి ఆశ నెరవేరాలని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:Acharya: ఆచార్య రీ షూట్స్ జరగడానికి కారణం అదేనా.. ఆందోళనలో ఫాన్స్
Recommended Videos: