Akhanda 2 Tickets Issue: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం ఎన్నో అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా విడుదలైంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా అంటే, కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయిపోయి వెళ్తారు ఆడియన్స్. ఈ సినిమాకు కూడా అలాగే వెళ్లారు. కానీ ఆడియన్స్ ని ఈ చిత్రం తీవ్రమైన నిరాశకు గురి చేసింది. సినిమా మొత్తం బాలకృష్ణ మాస్ ని చూపిస్తాడు అనుకుంటే, సూక్తులు భోదిస్తూ ఆడియన్స్ కి చిరాకు కలిగించే ప్రయత్నం చేశారు. కొన్ని ఫైట్ సన్నివేశాలు బాగున్నాయి , కానీ అవి కూడా చాలా అతిగా అనిపించాయి. అఖండ చిత్రం లో ఎమోషన్స్ చాలా బాగా పండాయి, కానీ ‘అఖండ 2’ లో ఒక్క ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంతటి నాసిరకమైన టేకింగ్ ఈమాద్య కాలంలో చూడలేదని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి తెలంగాణ లో టికెట్ రేట్స్ పెంచుతూ, ప్రీమియర్ షోస్ పెంచడం పై అభ్యంతరం తెలుపుతూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది నిన్న హై కోర్టు లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ని స్వీకరించి, విచారించిన హై కోర్టు తక్షణమే ప్రీమియర్ షోస్ ని రద్దు చేస్తూ, ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్స్ జీవో ని వెనక్కి తీసుకోవాలంటూ నోటీసులు జారీ చేసింది. కానీ మేకర్స్ ఈ ఆర్డర్ ని పట్టించుకోలేదు. ప్రీమియర్ షోస్ ని కొనసాగిస్తూ, మొదటి రోజు రెగ్యులర్ షోస్ కి టికెట్ రేట్స్ కూడా తగ్గించలేదు. దీంతో విజయ్ గోపాల్ మరోసారి కోర్టు ని ఆశ్రయించాడు. కోర్టు ఆర్డర్స్ ని ధిక్కరిస్తూ, నిన్న మేకర్స్ అఖండ 2 కి ప్రీమియర్ షోస్ ని కొనసాగించారని, తక్షణమే మూవీ టీం పై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు. దీనిపై కోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఇక పోతే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడం తో అడ్వాన్స్ బుకింగ్స్ పై చాలా బలమైన ప్రభావం పడిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో వచ్చేలా కనిపించడం లేదు. చూడాలిమరి ఫస్ట్ షోస్ నుండి పికప్ అవుతుందా లేదా అనేది.