Mutual funds information: నేటి కాలంలో ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే అప్పుల పాలై భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సేవింగ్ అంటే మనకు వచ్చే ఆదాయంలో 70 నుంచి 80% చేయడం కాదు. అలాగని తక్కువ మొత్తంలో దాచుకోవడం కాదు. ప్రణాళిక ప్రకారంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది నిల్వ ఉండడంతో పాటు రెట్టింపు అయ్యే అవకాశాలుంటాయి. అంతేకాకుండా సాంప్రదాయంగా డబ్బును కేవలం ఇంట్లో లేదా బ్యాంకు డిపాజిట్ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. రకరకాల మార్గాల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అందులో మ్యూచువల్ ఫండ్ అనేది ప్రస్తుతం చాలామంది ఎంచుకుంటున్న మార్గం. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ కూడా ఒక మాదిరిగా కాకుండా దీని మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మరి దీనిని ఎలా పెంచాలి?
ప్రస్తుత కాలంలో చాలామంది మ్యూచువల్ ఫండ్ పై అవగాహన రావడంతో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే సాంప్రదాయ రీతిలో కేవలం నెలకు ఒకే మొత్తంలో సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు మాత్రమే పొందుతారని అంటున్నారు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.5,000 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12% రాబడి ఉంటుంది. అంటే మొత్తంగా రూ. 24 లక్షలు పొందుతారు. అలాకాకుండా నెలకు రూ.5,000 మరో ఏడాది రూ.5,500 లా పెంచుకుంటూ పోతే 15 ఏళ్లలో రూ. 41 లక్షల వరకు రిటర్న్స్ పొందే అవకాశాలు ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్ లో ఎంతో కొంత లాభం ఉన్నప్పటికీ.. సాంప్రదాయంగా పెట్టుబడులు పెడితే అనుకున్న లాభాలు రావు. ప్రతి ఏడాది ఎంతోకొంత మొత్తాన్ని పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ తో సంపాదించవచ్చని అంటున్నారు.
అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలాగూ లాభం వస్తుంది కదా. అని పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం సరికాదు. ఎందుకంటే అధిక మొత్తంలో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కుటుంబ అవసరాలు, అత్యవసరాలు తీరడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. దీంతో ఆ ఇన్వెస్ట్మెంట్ను మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుంది. ఫలితంగా ఎలాంటి లాభం ఉండదు. అందువల్ల సాధ్యమైనంతవరకు వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటూ పోవాలని అంటున్నారు. ఒక నిర్ణీత వ్యవధిని పెట్టి ఆ సమయం వరకు ఆగిపోకుండా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అంటున్నారు. అలా చేస్తేనే ఆశించిన లాభాలు ఉంటాయని తెలుపుతున్నారు.
అయితే అనవసరపు పెట్టుబడుల నుంచి మాత్రమే ఇందులోకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని.. ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్ రిటర్న్ కోసం ఎదురుచూడద్దని అంటున్నారు. ఎందుకంటే దీర్ఘకాలికంగా పెట్టుబడులకు మాత్రమే మ్యూచువల్ ఫండ్ అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి వాటికి మధ్యతరగతి వారు తక్కువ మొత్తంలో ప్రారంభించి సాధ్యమైనంతవరకు పెంచుకుంటూ పోవాలని అంటున్నారు. ఒకేసారి లంసం పెట్టుబడి పెట్టడం కూడా సరికాదని అంటున్నారు.