https://oktelugu.com/

Game Changer Movie : Breaking News : ‘గేమ్ చేంజర్’ కి ఇచ్చిన టికెట్ రేట్స్ జీవో ని రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..దిల్ రాజు కి కోలుకోలేని షాక్!

ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్స్ ని పెంచి మంచి వెసులుబాటు కలిగించేలా చేసాయి. కాకపోతే ఆంధ్ర ప్రదేశ్ లో బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇచ్చారు, తెలంగాణ లో ఇవ్వలేదు. అదొక్కటే తేడా, అయితే నిన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్స్ ని ఉపసంహరించుకుంటూ జీవో ని రద్దు చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 12, 2025 / 10:03 AM IST

    Game Changer Movie Ticket rates

    Follow us on

    Game Changer Movie :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి భారీ టికెట్ రేట్స్ ఇవ్వడం వల్ల, రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా తోడై మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కూడా డీసెంట్ హోల్డ్ ని కనబర్చి 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్స్ ని పెంచి మంచి వెసులుబాటు కలిగించేలా చేసాయి. కాకపోతే ఆంధ్ర ప్రదేశ్ లో బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇచ్చారు, తెలంగాణ లో ఇవ్వలేదు. అదొక్కటే తేడా, అయితే నిన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్స్ ని ఉపసంహరించుకుంటూ జీవో ని రద్దు చేసింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే టికెట్ రేట్స్ పెంపు , తెల్లవారుజామున ప్రదర్శింపబడే షోస్ కి వ్యతిరేకంగా ఒక వ్యక్తి హై కోర్టు లో పిటీషన్ దాఖా చేశాడు. ఇటీవలే హైదరాబాద్ సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన జరిగింది. అది పూర్తిగా ప్రభుత్వం బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇవ్వడం వల్లే కదా. ఇలా తెల్లవారుజామున షోస్ ని ప్రదర్శించి మళ్ళీ జనాలకు జరగరానివి జరిగితే ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకుంటుందా..?, అదే విధంగా ఇలా టికెట్ రేట్స్ ప్రతీ కొత్త సినిమాకి పెంచి జనాల మీద అదనపు భారం వెయ్యడం ఎంత వరకు కరెక్ట్?, సినిమా మీద జనాలకు ఉన్న ఇష్టాన్ని ఇలా అత్యధిక డబ్బుతో క్యాష్ చేసుకోవాలని అనుకోవడం సమంజసమేనా? అంటూ పిటీషన్ దాఖా చేసారు. దీనిని విచారించిన కోర్టు టికెట్ రేట్స్ పెంపు, ముందస్తు షోస్ గురించి ప్రభుత్వాన్ని పునరాలోచించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

    దీంతో ప్రభుత్వం నిన్న ఒక జీవో ని జారీ చేస్తూ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఇచ్చిన టికెట్ హైక్స్, ముందస్తు షోస్ ని రద్దు చేస్తున్నామని, ఈ నెల 16వ తేదీ నుండి ఏ కొత్త సినిమాకి కూడా టికెట్ హైక్స్, ముందస్తు షోస్ ఉండవని సంచలన ప్రకటన చేసింది. దీనికి టాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడినట్టు అయ్యింది. మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ‘గేమ్ చేంజర్’ తర్వాత విడుదలయ్యే సంక్రాంతి సినిమాలకు బెనిఫిట్ షోస్ ని రద్దు చేస్తున్నామని, కేవలం 5 షోస్ ని మాత్రమే ప్రదర్శించుకోవాలని, సంక్రాంతికి పోలీస్ భద్రతా ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. దీనిని బట్టీ చూస్తుంటే రాబోయే రోజుల్లో టికెట్ రేట్స్, బెనిఫిట్ షోస్ విషయంలో రెండు ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాయని తెలుస్తుంది.