Tejaswi Madivada: ‘తేజస్వి మడివాడ’ తెలుగు అమ్మాయినే అయినా, అమ్మడు వ్యవహారంలో ఎక్కడా తెలుగుతనం కనిపించదు. కాకపోతే, ఈ భామ సాత్వికమే కానీ వెరీ బోల్డ్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో.. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోదు. అయితే కరోనా కారణమో, లేక ఏదైనా పర్సనల్ విషయమో తెలియదు గానీ, తేజస్వి మడివాడ గత కొన్ని నెలలుగా అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ వస్తోంది.

ఎందుకు సడెన్ గా గ్లామర్ షో కి దూరమయ్యావ్ అంటూ ఆమె పై నెటిజన్లు మధ్యమధ్యలో ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా తనను ఇబ్బంది పెట్టినా.. తేజస్వి మాత్రం ఎక్కడా స్పందించలేదు. అదే కరోనాకి ముందు ఇన్ స్టాగ్రామ్ లో నిత్యం తన హాట్ హాట్ ఫోటోలతో విరుచుకుపడేది. గ్యాప్ దొరికితే చాలు.. ఛలో మంటూ ఘాటు ఫోజులతో హీట్ పెంచే ఫోటోలు పోస్ట్ చేస్తూ బాగా హడావుడి చేసేది.

అయితే, గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉంటూ తన హాట్ హడావిడిని బాగా తగ్గించింది. దాంతో కుర్రాళ్ళు అమ్మడును ఫాలో అవ్వడం ఆపేశారు. ఒక్కసారిగా ఫాలోవర్స్ తగ్గారు. ఇక పెరిగేలా కనిపించడం లేదు. ఇది గమనించిన తేజస్వి మళ్ళీ అభిమానుల సంఖ్య పెంచుకోవడానికి రెడీ అయింది. నిన్న కొత్త హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో వాతావరణాన్ని హీట్ చేసింది.
బాగా టైట్ డ్రెస్ లో సెన్సార్ అయ్యే ఎక్స్ పోజింగ్ తో స్టిల్స్ వదిలింది. ఏది ఏమైనా ఇలాంటి స్టిల్స్ వదలడంతో ఈ బ్యూటీ మేటి. అన్నట్టు తేజస్వికి బూతులు మాట్లాడటంలో కూడా ప్రముఖ స్థానం ఉంది. ఇదే విషయం పై ఆమె మాట్లాడుతూ.. ఎదుటి మనిషిని బట్టి నేను ఉంటాను. అంటూ ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేజస్వి మొహమాటం లేకుండా చెప్పింది.

మరి ఈ కొత్త హాట్ ఫోటోలతో మళ్ళీ రచ్చకు దిగిన తేజస్వి కి సినిమాల్లో మళ్ళీ అవకాశాలు పెరుగుతాయా ? ప్రస్తుతానికి అయితే ఆమె చేతిలో పెద్దగా ఛాన్స్ లు అయితే లేవు.